అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan) హీరోగా వచ్చిన డాన్(Don) సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. హైదరాబాద్‌లో అయితే ఏకంగా 450 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాను తెలుగులో ఎన్టీఆర్‌తో(NTR) యుగంధర్(Yugandhar) పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో రజనీకాంత్(Rajinikanth), మలయాళంలో మోహన్‌లాల్(Mohanlal) హీరోలుగా డాన్‌ను రీమేక్ చేశారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్(Shahruk khan) మళ్లీ డాన్ సినిమాను రీమేక్ చేశాడు.
అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan) హీరోగా వచ్చిన డాన్(Don) సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. హైదరాబాద్‌లో అయితే ఏకంగా 450 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాను తెలుగులో ఎన్టీఆర్‌తో(NTR) యుగంధర్(Yugandhar) పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో రజనీకాంత్(Rajinikanth), మలయాళంలో మోహన్‌లాల్(Mohanlal) హీరోలుగా డాన్‌ను రీమేక్ చేశారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్(Shahruk khan) మళ్లీ డాన్ సినిమాను రీమేక్ చేశాడు. దీన్ని తమిళంలో అజిత్(Ajeeth) హీరోగా, తెలుగులో ప్రభాస్(prabhas) హీరోగా రీమేక్ చేశారు. షారూక్ డాన్ హిట్ కావడంతో డాన్ 2(Don-2)ను నిర్మించారు. అది కూడా హిట్టయింది. ఈ సినిమా వచ్చి పదేళ్లయ్యింది. డాన్ 3 తప్పకుండా ఉంటుందని దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్(Farhan Akhtar) చెప్పారు. ఈ మాట చెప్పి ఏడాది దాటింది. ఇక ఇప్పుడు ఆయన చెప్పలేదు కానీ డాన్ 3 రావడం పక్కా అని నిర్మాత రితేష్ సిధ్వానీ(Rithesh Sidhwani) తెలిపారు. కాకపోతే డాన్ 3లో షారూక్ నటించడంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ స్క్రిప్ట్‌ను పకడ్బందీగా రూపొందించినప్పటికీ , ఇది తనకు సరిపోదని, ప్రస్తుతం తన మార్క్ కమర్షియల్ సినిమాల్లో నటించాలనుకుంటున్నానని షారూక్ ఖాన్ చెప్పాడట. షారూక్ తప్పుకోవడంతో కొత్త హీరో కోసం ట్రై చేస్తున్నారు మూవీ మేకర్స్. మరోవైపు ఫర్హాన్ అఖ్తర్.. ప్రియాంక చోప్రాతో కలిసి ‘జీ లే జరా’ తెరకెక్కించే పనిలో ఉన్నారు.