సినిమాల్లోకి వెళితే బోల్డంత సంపాదించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. కోట్లకు కోట్లు వెనుకేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపేయవచ్చని భావిస్తారు. కానీ ఆ అవకాశం బడా హీరోయిన్లు, బడా దర్శకులకు మాత్రమే ఉంటుంది. సహాయ నటులకు(supporting Actors) ఆ ఛాన్స్ ఉండదు. వారి రెమ్యునిరేషన్ చాలా తక్కువగా ఉంటుంది.
సినిమాల్లోకి వెళితే బోల్డంత సంపాదించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. కోట్లకు కోట్లు వెనుకేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపేయవచ్చని భావిస్తారు. కానీ ఆ అవకాశం బడా హీరోయిన్లు, బడా దర్శకులకు మాత్రమే ఉంటుంది. సహాయ నటులకు(supporting Actors) ఆ ఛాన్స్ ఉండదు. వారి రెమ్యునిరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వారి జీవితం దుర్భరంగానే ఉంటుంది. ఒక్కోసారి తినడానికి కూడా డబ్బులుండవు. ఏ రోగమో వస్తే హాస్పిటల్‌కు కూడా వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఇలాగే ఓ నటి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేక ప్రాణాలు విడిచింది. సోమవారం తెల్లవారుజామున 2.15 నిమిషాలకు చనిపోయింది. అంజలి(Anjali) నటించిన షాపింగ్ మాల్(Shopping Mall) సినిమాలో ఓ పాత్ర చేసిన 44 ఏళ్ల సింధు(Sindhu) తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు వేసింది. 2020లో ఆమెకు రొమ్ము కేన్సర్ సోకింది. దాంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. కేన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకునేంత డబ్బు ఆమె దగ్గర లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్ని రోజుల కిందట ఆరోగ్యం బాగా విషమించింది. దాంతో కిలిపక్కంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక ప్రాణాలు వదిలేసింది. ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటిగా ఎంతో కొంత సంపాదించుకోవచ్చని అనుకుంది కానీ అది కుదరలేదు. సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు కేన్సర్ ఆమెను మింగేసింది.