Ambati Ram Babu : బ్రో కలెక్షన్లపై అంబటి రాంబాబు ట్వీట్... నిజంగానే వసూళ్లు అలా ఉన్నాయా?
తమిళంలో విజయవంతమైన వినోదయ సితం(Vinodhaya Sitham) సినిమాను తెలుగులో బ్రోగా(BRO) తీశారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్‌లు(Saidharam tej) నటించారు. తమిళంలో ఎలాంటి రాజకీయ వాసనలు లేవు కానీ తెలుగులో ఉద్దేశపూర్వకంగా జొప్పించారు. ఇదే రాజకీయ రగడకు దారి తీసింది. సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను పోషించిన పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై దుమారం చెలరేగింది.

Ambati Ram Babu
తమిళంలో విజయవంతమైన వినోదయ సితం(Vinodhaya Sitham) సినిమాను తెలుగులో బ్రోగా(BRO) తీశారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్‌లు(Saidharam tej) నటించారు. తమిళంలో ఎలాంటి రాజకీయ వాసనలు లేవు కానీ తెలుగులో ఉద్దేశపూర్వకంగా జొప్పించారు. ఇదే రాజకీయ రగడకు దారి తీసింది. సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను పోషించిన పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై దుమారం చెలరేగింది. ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును(Ambati Ram Babu) పోలి ఉందని చెప్పాల్సిన పని లేదు. దీనిపై అంబటి రాంబాబు స్పందిస్తూ 'నాది ఆనంద తాండవం.. నీది శునకానందం' అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదంతా పాత ముచ్చట. లేటెస్ట్‌గా రాంబాబు బ్రో సినిమా కలెక్షన్లపై ఓ ట్వీట్ చేశారు. 'ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు !!' అంటూ కామెంట్ చేశారు. అంబటి రాంబాబు అన్నారని కాదు కానీ .. సినిమా కలెక్షన్లు ఏమంత ఆశాజనంగా లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి తెలుస్తోంది. మొదటి రోజు 30.05 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వస్తే, రెండో రోజు 17.05 కోట్ల రూపాయలు వచ్చాయి. మూడో రోజుకొచ్చేసరికి 16.9 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు లభించాయి. నాలుగో రోజు అంటే సోమవారం కేవలం అయిదు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయట! నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 69.9 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు !
ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !!@PawanKalyan @vishwaprasadtg— Ambati Rambabu (@AmbatiRambabu) July 31, 2023
