తెలుగు వాళ్లకు సినిమా నచ్చితే చిన్నదా.. పెద్దదా అని చూడరు. హిట్ చేసేస్తూ ఉంటారు. తాజాగా మరో చిన్న సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తూ ఉంది. సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఫిబ్రవరి 2న రిలీజైన ఈ సినిమా.. తొలి మూడు రోజుల్లో రూ.4.31 కోట్లు వసూలు చేసింది. గత వారం రిలీజైన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని ప్రేక్షకులు చెబుతూ ఉన్నారు. […]
తెలుగు వాళ్లకు సినిమా నచ్చితే చిన్నదా.. పెద్దదా అని చూడరు. హిట్ చేసేస్తూ ఉంటారు. తాజాగా మరో చిన్న సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తూ ఉంది. సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఫిబ్రవరి 2న రిలీజైన ఈ సినిమా.. తొలి మూడు రోజుల్లో రూ.4.31 కోట్లు వసూలు చేసింది. గత వారం రిలీజైన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని ప్రేక్షకులు చెబుతూ ఉన్నారు.
తొలి రోజు భారతదేశంలో రూ.1.2 కోట్ల నెట్ కలెక్షన్లు మొదలుపెట్టిన ఈ మూవీ.. రెండో రోజు రూ.1.5 కోట్లు, మూడో రోజు రూ.1.6 కోట్లు కలెక్ట్ చేసింది. తొలి మూడు రోజులు కలిపి రూ.4.3 కోట్లు వచ్చాయి. సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్లే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు మూడు రోజులు క్రమంగా పెరుగుతూ వెళ్లాయి.అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బ్యూటీఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీ. మల్లి పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. నటిగా శరణ్యలోని కొత్త కోణాన్ని ఈ సినిమా చూపించింది. లక్ష్మి, మల్లిల ప్రేమకథను డిఫరెంట్‌గా ఎండ్ చేశాడు డైరెక్టర్.