హీరోయిన్ అమలాపాల్(Amala Paul) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) సినిమా నాయక్‌తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ మలయాళ భామ తర్వాత అల్లు అర్జున్‌తో(Allu Arjun) ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది. ఈ సంవత్సరం భోళా అనే హిందీ సినిమాలో అజయ్ దేవగణ్‌కు జోడిగా మెప్పించింది.
హీరోయిన్ అమలాపాల్(Amala Paul) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) సినిమా నాయక్‌తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ మలయాళ భామ తర్వాత అల్లు అర్జున్‌తో(Allu Arjun) ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది. ఈ సంవత్సరం భోళా అనే హిందీ సినిమాలో అజయ్ దేవగణ్‌కు జోడిగా మెప్పించింది. ఈ రోజు అమలాపాల్ పుట్టిన రోజు. 32వ బర్త్‌డేను జరుపుకుంటున్న అమలాపాల్ రెండో పెళ్లికి(Second Marriage) రెడీ అయ్యింది. చాన్నాళ్లుగా జగత్ దేశాయ్(Jagat Desai) ప్రేమలో ఉన్న అమల త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా(Social Media) ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఓ వీడియో షేర్ చేసింది. జగత్ దేశాయ్‌తో కలిసి అమలాపాల్ డాన్స్ చేసిన వీడియో అది! ఇందులో తన ప్రేమసి అమలాపాల్‌కు జగత్ దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కాబోయే దంపతులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 'నా జిప్సీ క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్' అంటూ జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.ఇది చూసిన ఫ్యాన్స్ అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇంతకు ముందు డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ను పెళ్లాడిన అమలాపాల్.. 2017లో విడాకులు తీసుకుంది. 2009లో వచ్చిన మలయాళ చిత్రం నీలతామరతో అమలాపాల్ సినీ కెరీర్ మొదలయ్యింది. 2010లో వచ్చిన తమిళ సినిమా మైనాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది.