దేశమంతా ప్రస్తుతం పుష్ప మ్యానియానడుస్తోంది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది పుష్ప ద రూల్. వివాదల విషయం పక్కన పెడితే..

దేశమంతా ప్రస్తుతం పుష్ప మ్యానియానడుస్తోంది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది పుష్ప ద రూల్. వివాదల విషయం పక్కన పెడితే.. పుష్ప మూవీకి త్వరలో పార్ట్ 3 కూడా రాబోతోంది.

పుష్ప ద రూల్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ ను సాధించారు టీమ్. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈసినిమా చాలా పెద్ద పెద్ద సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. కేవలం ఆరేరోజుల్లో 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ను క్రాస్ చేసేసింది పుష్ప2. ఇక ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఈలోపు అల్లు అర్జున్ అరెస్ట్ లాంటి కాంట్రవర్సీలు నడుస్తున్నాయి.

అయితే పష్ప నుంచి ఇప్పటి వరకూ రెండు సినిమాలు వచ్చాయి. ఇక పుష్ప3 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు టీమ్. పుష్ప ద రాంపేజ్ టైటిల్ ను కూడా ప్రకటించారు. అయితే అది ఎలా ఉండబోతోంది. అందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా పుష్ప2 క్లైమాక్స్ లో ఓవ్యక్తిని పరిచయం చేశారు. కాని అతను ఎవరు అనేది మాత్రంక్లారిటీ ఇవ్వలేదు.

పుష్ప3 లో అల్లు అర్జున్ తో తలపడబోయేది అతనే అని అర్ధం అవుతుంది. కాని అతను ఎవరు..? ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అతను ఎవరో కాదు విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది. పుష్ప3 ద ర్యాంపేజ్ లో అల్లు అర్జున్ తో తలపడటానికి పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లేస్ ను విజయ్ దేవరకొండకు ఆఫర్ చేశారట సుకుమార్. దానికి విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.సర్ ప్రైజ్ లు ప్లాన్ చేయడంతో సకుమార్ దిట్ట. కాని అవి మధ్యలోనే రివిల్ అవుతుంటాయి.

ఇక పుష్ప3 షూటింగ్ స్టార్ట్ అయితే కాని ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్పలేం. ఒక వేళ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఉన్నది నిజం అయితే.. షూటింగ్ జరిగే టైమ్ లో తప్పకుండా బయటకు వస్తుంది. ఈ విషయంలో మూవీ టీమ్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ గట్టిగా నడుస్తున్నాయి. మరి ఈ విషయం నిజమా..? లేక రూమర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి...?

ehatv

ehatv

Next Story