అల్లు అర్జున్‌(Allu Arjun)  హీరోగా, సుకుమార్‌(sukumar) డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్‌ ఇండియా మూవీ కాకపోయినా ఆ రేంజ్‌ హిట్‌ను సంపాదించింది. నేషనల్ వైడ్‌గా చాలా మంది అల్లు అర్జున్‌కు అభిమానులయ్యారు.

అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా, సుకుమార్‌(sukumar) డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్‌ ఇండియా మూవీ కాకపోయినా ఆ రేంజ్‌ హిట్‌ను సంపాదించింది. నేషనల్ వైడ్‌గా చాలా మంది అల్లు అర్జున్‌కు అభిమానులయ్యారు. ఇప్పుడు పుష్ప సెకండ్‌పార్ట్‌ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బన్నీ బర్త్‌డే సందర్భంగా గత నెలలో విడుదల చేసిన హంట్‌ ఫర్‌ పుష్ప కాన్సెప్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో రికార్డు వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ ఏమిటంటే,

ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లి(Maredumilli), ఒడిశా(Odissa) పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నదట! కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారట! ఈ షెడ్యూల్‌ తర్వాత విదేశాల్లో షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. యూరప్‌తో పాటు బ్యాంకాక్‌లో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్‌ను తెరకెక్కించబోతున్నారు. రష్మిక మందన్న, ఫహద్‌ ఫాజిల్‌, ధనుంజయ, రావు రమేష్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న పుష్ఫ-2 సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated On 17 May 2023 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story