అల్లు అర్జున్, రాంచరణ్‌ ఎంత దగ్గరి బంధువులో తెలియంది కాదు. కానీ కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్‌ వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్, రాంచరణ్‌ ఎంత దగ్గరి బంధువులో తెలియంది కాదు. కానీ కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్‌ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో అల్లు అర్జున్‌ వైసీపీకి మద్దతుగా నిలిచారన్న ఆగ్రహంతో మెగా అభిమానులు ఆయనను ట్రోల్ చేశారు. ఆ సమయంలోనే నాగబాబు ట్వీట్ చేయడం, దాన్ని వైసీపీ(YCP) ట్రోల్‌ చేయడంతో మళ్లీ తీసేయడం జరిగాయి. పుష్ప2(Pushpa 2) వివాదంలో కూడా అల్లు అర్జున్‌(Allu arjun)ను మెగా ఫ్యాన్స్ ట్రోల్స్‌ చేశారు. తాజాగా ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ని రాంచరణ్ అన్ ఫాలో చేశారని వార్త చక్కర్లు కొడుతోంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే అసలు అంతకుముందు రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్ ఒకరినొకరు ఫాలో అయ్యారో లేదనేది తెలియదు. కానీ, నెటిజన్లు మాత్రం.. అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశారంటూ రచ్చ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది వీళ్లద్దరికి, అలాగే వారి హ్యాండిల్స్‌ను హ్యాండిల్ చేసే బృందాలకే తెలుస్తుంది. ఈ మధ్యే ఓ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య, ఇద్దరి అభిమానుల మధ్య మరింత చిచ్చు పెంచటానికి ఎవరో చేస్తున్న ప్రచారం అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అసలు నిజమేంటనేది తెలియాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story