నేచురల్ స్టార్ నాని(Nani), మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh)జంటగా.. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కించిన సినిమా దసరా. శ్రీరామనవమి సందర్భంగా మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా(Dasara) పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెక్స్ సాధిచింది. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే నానీ...

నేచురల్ స్టార్ నాని(Nani), మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh)జంటగా.. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కించిన సినిమా దసరా. శ్రీరామనవమి సందర్భంగా మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా(Dasara) పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెక్స్ సాధిచింది. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే నానీ... ఈసినిమాలో ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. కీర్తి సురేష్ కూడా మాస్ లుక్ తో పాటు.. యాసను కూడా ఇరగదీసింది ఇలా సినమా లాంతా డిఫరెంట్ ఫ్లేవర్ తో.. జనాలకు బాగా కిక్కు ఏక్కేసింది.

శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్ కోసం చూస్తున్న నానీ(Nani)కి దసరా సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా చేసింది. ఫస్ట్ డే నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న దసరా(Dasara)..ఇప్పటికే 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఫ్ట్ టైమ్ నానీ పాన్ ఇండియాకు వెళ్ళగా.. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యి.. నానీకి మెమరబుల్ హిట్ ను అందించింది సినిమా.

ఇక దసరా సినిమాపై అభిమానులు, ఆడియన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమ్ కు ఫోన్ చేసి మరీ.. పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలతో పాటు అనేకమంది నటీనటులు దసరా సినిమాని, చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై అల్లు అర్జున్ అభినందనలు కురిపించారు. దసరా సినిమాతో పాటునానిని, మూవీ టీమ్ ను అభినందిస్తూ.. ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ ఏమన్నారంటే.. దసరా టీం అందరికి బిగ్ కంగ్రాట్స్. ఇది బ్రిలియంట్ సినిమా. నా బ్రదర్ నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కీర్తిసురేష్, మిగిలిన టీం అంతా కూడా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సత్యన్ గారు అద్భుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ డెబ్యూట్ డైరెక్టర్ లా అనిపించకుండా చేశాడు. ఇతని తెలివితేటలు అమోఘం. ప్రొడ్యూసర్, చిత్రయూనిట్ కి హృదయపూర్వక అభినందనలు. సమ్మర్ లోనిజమైన దసరా ఈ సినిమా అని ట్వీట్ చేశారు. దీంతో బన్నీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అటుబన్నీ ఫ్యాన్స్.. నానీ ఫ్యాన్స్ కూడా ఈ ట్వీట్ తో దిల్ కుష్ అవుతున్నారు. అంతే కాదు. దసరా సినిమాపై అల్లు అర్జున్ రివ్యూతో అటు అల్లు ఫ్యాన్స్.. ఇటు కామన్ ఆడియన్స్ కూడా ఇప్పటి వరకూ సినిమా చూడనివారు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికీ.. థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది మూవీ.

Updated On 17 April 2023 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story