✕
Allu Arjun Pushpa:2 The Rule : పుష్ప2: నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. ఈ...య్ అంటున్న బన్నీ ఫ్యాన్స్..!
By EhatvPublished on 5 April 2023 5:36 AM GMT
2021లో పుష్ప: ది రైజ్ (Pushpa:The Rise) సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఓ రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప2: ది రూల్ (Pushpa 2:The Rule) నుంచి ఓ కొత్త అప్ డేట్ ఒచ్చేసిందేనే చెప్పాలి. అల్లు అర్జున్ (Allul Arjun), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహిస్తున్నారు.

x
Pushpa2 The Rule
-
- 2021లో పుష్ప: ది రైజ్ (Pushpa:The Rise) సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఓ రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప2: ది రూల్ (Pushpa 2:The Rule) నుంచి ఓ కొత్త అప్ డేట్ ఒచ్చేసిందేనే చెప్పాలి. అల్లు అర్జున్ (Allul Arjun), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహిస్తున్నారు
-
- ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున సినిమాకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేయాలని పుష్ప 2 (Pushpa2) మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన ఓ చిన్న లుక్‌ను విడుదల చేశారు.
-
- పుష్పరాజ్ (Pushpa Raj) తిరుపతి జైలు నుంచి తప్పించుకుని ప్రస్తుతం ఎక్కడున్నాడో అనే క్వశ్చన్‌ను రైజ్ చేసే గ్రిప్ ఉన్న వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో మొదలవుతుంది. అయితే ఈ వీడియోకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని నిర్మాతలు (Producers) అంటున్నారు. అది తెలియాలంటే 2023 ఏప్రిల్ 7న మధ్యాహ్నం 04:05 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ప్రొడ్యూసర్లు.
-
- ఈ వీడియో అల్లు అర్జున్ (Allul Arjun)కు అండ్ అలాగే బన్నీ అభిమానులకు ఒక ఎగ్జైట్మెంట్గా నిలుస్తుందనే చెప్పాలి. అయితే ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వబోతున్న ఈ వీడియోలో ఎలాంటి సర్ ప్రైజ్‌లు ఉంటాయో చూడాలి మరి.
-
- మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), సునీల్ (Sunil), జగదీష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ehatv
Next Story