✕
Allu Arjun completed 2 decades in Industry : కృషి, పట్టుదలలే అల్లు అర్జున్ విజయ రహస్యం.. !
By EhatvPublished on 28 March 2023 4:36 AM GMT
తెలుగు తెర మీద శక్తివంతమైన ఒక విభిన్నమైన హీరోయిజం పుట్టినరోజు ఈ రోజు అంటే మార్చి 28. సరిగ్గా ఈరోజుకి ఇరవై ఏళ్ళ క్రితం పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఇంటి నుంచి, ప్రముఖనిర్మాత అల్లు అరవింద్ ( Allu Aravind) ఒడి నుంచి ఒక హీరో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్షణాలు పురుడు పోసుకున్న సంచలన ఘట్టాన్ని నమోదు చేసుకున్న ఓ గొప్ప రోజు. అదే... అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా పరిచయమై 20 ఏళ్లు పూర్తయింది.

x
AA
-
- తెలుగు తెర మీద శక్తివంతమైన ఒక విభిన్నమైన హీరోయిజం పుట్టినరోజు ఈ రోజు అంటే మార్చి 28. సరిగ్గా ఈరోజుకి ఇరవై ఏళ్ళ క్రితం పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఇంటి నుంచి, ప్రముఖనిర్మాత అల్లు అరవింద్ ( Allu Aravind) ఒడి నుంచి ఒక హీరో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్షణాలు పురుడు పోసుకున్న సంచలన ఘట్టాన్ని నమోదు చేసుకున్న ఓ గొప్ప రోజు. అదే... అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా పరిచయమై 20 ఏళ్లు పూర్తయింది.
-
- దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తన ప్రతిభాపాటవాలతో, వందలాది చిత్రాలలో ప్రధాన భూమికలు పోషించి, తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని నెలకొల్సుకుని, పద్మశ్రీ అవార్డును గెలుచుకున్న మహానటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) అనే మహానటవటవృక్షానికి కాసిన మరో కొమ్మ....అల్లు అర్జున్.
-
- అల్లు అర్జున్ ఫాదర్.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ( Allu Aravind) కూడా అదపాతడపా సినిమాలలో నటించినా ఆయన ఆ కెరీర్‌ని కొనసాగించలేదు. నిర్మాతగా తలెత్తి, నిర్మాతగా చిరస్మరణీయమైన చిత్రాలను నిర్మించి, భారతదేశం గర్వించదగ్గ అగ్రనిర్మాతగా ఎదిగిపోయారు. ఫలితంగా అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) తర్వాత ఆయన చరిత్రను కొనసాగించేవారు లేరనుకుంటున్న టైంలోనే అల్లు అర్జున్ (Allu arjun) తెరంగేట్రం చేయడం జరిగింది.
-
- అదే ‘గంగోత్రి’ (Gangotri) చిత్రం ద్వారా మొదటి చిత్రంలోనే అల్లు అర్జున్ (Allu arjun) చాలా మెచ్యూరిటీ ఉన్న నటుడిగా, ఎంతో అనుభవం అన్న హీరోలా అద్భుతంగా చేశాడన్న ముద్రను సాధించగలిగాడు. ఆ సినిమాయే అల్లు అర్జున్ (Allu arjun) కెరీర్‌కి సింహద్వారాలను తెరిచింది. అల్లువారింటి నుంచి ఒక బుల్లెట్ దూసుకొచ్చినట్టయింది.
-
- వెరీ ప్రామిసింగ్ హీరో.... లక్షణాలు, స్టయిల్... ఇవన్నీ తొలిచిత్రంతోనే ఆడియన్స్ మనసులో రిజిస్టర్ కాగా ‘గంగోత్రి’ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో అల్లు ఆర్జున్ (Allu arjun)కి పరిశ్రమకి ఘనస్వాగతం పలికింది. నేటికి ఇరవై ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే ఒక సంచలన ప్రయాణానికి ఎర్ర తివాచీ పరిచింది. అక్షరాల అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah)గారి ప్రతిభాపాటవాలను పూర్తిస్థాయిలో పుణికి పుచ్చుకున్న అల్లు అర్జున్‌లో తాతయ్య ఈజ్ ప్లస్ ప్రజెంట్ ట్రెండ్ స్టయిలైజేషన్ ప్లస్ హీరోయిక్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి అల్లు అర్జున్ కెరీర్ తారాజువ్వలా దూసుకుపోయింది.
-
- దాని వెనుక అల్లు అర్జున్ (Allu arjun)లోని తపన, తాపత్రయం, కృషి, దీక్ష... ఎన్నైనా చెప్పుకోవచ్చు.. ఈ దశకి చేరుకునేందుకు అవసరమైనంత శ్రమ, పరిశ్రమ, పట్టుదల, అంకితభావం... అన్నీ...అన్నీ అల్లు అర్జున్ (Allu arjun) బహుముఖ పోటీతో ఉడికెత్తిపోయే చిత్రపరిశ్రమలో ఈరోజున ఈ స్థాయిలో నిలదొక్కుకుని విజయకేతనం ఎగురవేసే స్థితిలో పదిలపరిచాయి.
-
- అల్లు అరవింద్ ( Allu Aravind) కుమారుడైనంత మాత్రాన అల్లు అర్జున్ (Allu arjun)కి ఈ స్థానం, ఈ స్థాయి దక్కాయంటే అది నిజం కాదు. పరిశ్రమలో ఎందరో కొడుకులను హీరోలుగా చెయ్యాలని తాపత్రయ పడ్డవారే. ఈ ప్రయత్నంలో ఎక్కువ శాతం వైఫల్యాన్నే చవిచూశారు. ఉన్నవి కాస్తా పోగొట్టుకుని చతికిలబడ్డారు. వారందరిలో అల్లు అర్జున్ ఒక మినహాయింపు. తాటిచెట్టు ఎక్కేవారిని కొసవరకూ ఎవ్వరూ ఎక్కించలేరు. ఏ ప్రోత్సాహమైనా మొదటి అడుగు వరకే. తర్వాత ఎవరి శక్తి సామర్ధ్యాలే వారిని కడవరకూ తీసుకెళ్ళేవి.
-
- అల్లు అర్జున్ (Allu arjun)కి కూడా అంతే. తాను ఎదగాలంటే, ప్రేక్షకులను రంజింపచేయాలంటే, విజయవంతమైన హీరోగా ప్రకాశించాలంటే, రికార్డులను, రివార్డులను సొంతం చేసుకోవాలంటే...ఏ బ్యాక్గ్రౌండ్లు సరిపోవు....స్వయంకృషి ఒక్కటే విజయమంత్రం అని త్రికరణశుద్ధిగా నమ్మాడు కాబట్టే తెలుగు ప్రేక్షకుల నీరాజనాలకు, ప్రశంసల పరంపరకు అల్లు అర్జున్ పాత్రుడు (Allu arjun) కాగలిగాడు.
-
- స్వయం కృషి మంత్రాన్ని విస్మరించనివారికి విజయదేవత ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. వరాలను ప్రసాదిస్తూనే ఉంటుంది. ఆ మంత్రమే అల్లు అర్జున్ (Allu arjun) విజయ రహస్యం. ప్రేక్షకుల (Audience) మద్దతే లభించనినాడు ఎంతటి ఫ్యామిలీ నుంచి వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతందన్నది ఎన్నో సందర్భాలలో చరిత్ర ప్రత్యక్షంగా వీక్షించింది.
-
- ఎన్ని చిత్రాలు అల్లు అర్జున్ చేశాడు, ఎన్నెన్ని హిట్స్ అయ్యాయి, ఎంత కలెక్షన్స్ డ్రా చేశాయి అన్నవాటి కన్నా, అన్నింటినీ కలగలుపుకుని, అల్లు అర్జున్ (Allu arjun) ఏ స్థాయికి దూసుకెళ్ళాడు అనే సారాంశమే ప్రధానం. ప్రతీ చిత్రంతోనూ ఎదిగాడు. హిట్స్ మీద హిట్స్ కొట్టాడు. ఇంక అల్లు అర్జున్ (Allu arjun)కి తిరుగే లేదని విమర్శకులు సైతం ఒప్పుకోవాల్సిన గొప్ప విజయాలను తన క్రెడిట్లో వేసుకోగలిగాడు.
-
- ఆర్య 1 అండ్ 2 రెండిటికీ రెండు ఆణిముత్యాలు. దర్శకులు ఎవరైనా సరే అల్లు అర్జున్ ఒత్తైన సంతకం కొట్టొచ్చినట్టు కనిపించేంతగా పాత్రలను మాస్టర్ చేశాడు. బన్నీ (Bunny) అనే ముద్దు పేరుతో వచ్చిన సినిమా కూడా కమర్షియల్‌గా విజయఢంకా మ్రోగించడంతో బన్నీ అన్న పేరు సార్ధకమైపోయింది. ఎంతగా అంటే ఎవరు ఆల్లు అర్జున్‌కి అతి సన్నిహితంగా ఉన్నా వారిని చిత్రపరిశ్రమలో ఆ పేరుతోనే వారు పాపులర్ అయినంత విరివిగా ఆ పిలుపు ప్రచారమైంది.
-
- అందుకు ప్రముఖ నిర్మాత బన్నీవాసు (Bunny Vasu)ని మించిన ఉదాహరణ మరొకటి లేదు. లైటర్‌వెయిన్ హీరోయిజం నుంచి, ఎమోషనల్ పెర్ఫామెన్స్ వరకూ కూడా అల్లు అర్జున్‌కి ప్రత్యామ్నాయం లేదనే నమ్కికను అందరిలోనూ నింపాడు. డైలాగ్ చెప్పాలంటే అల్లు అర్జున్ (Allu arjun) లా చెప్పాలి. డాన్స్‌లు చెయ్యాలంటే అల్లు అర్జున్‌లా చెయ్యాలి. యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే అల్లు అర్జున్‌లా చెయ్యగలగాలి.....ఇలా ప్రతీ యాంగిల్లోనూ తనదైన సంతకాన్ని పేల్చాడు.
-
- ఎన్నో హిట్స్ తర్వాత వచ్చిన అల...వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ (Allu arjun) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇండస్ట్రీ హిట్‌గా అల...వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) చిత్రం మునపటి రికార్డులను చిందరవందర చేసింది. ప్రతీ అడుగు పిడుగై, ప్రతీ మలుపు గెలుపై రేసుగుర్రంలా పరిగెడుతున్న అల్లు అర్జున్ పుష్ఫ (Pushpa) చిత్రంతో నేషనల్ స్టేజ్ మీద గాండ్రించాడు. వీరవిహారం చేశాడు.
-
- ఆల్ టైం రికార్డు కలెక్షన్స్‌తో పుష్ఫని తెలుగు కళామతల్లికి కానుకగా ఇస్తూ, జాతీయస్థాయిలో విజయదుందుభిలు ప్రతిధ్వనింపచేసిన అల్లు అర్జున్ 20 ఏళ్ళ కెరీర్ సంబరాలలో కేరింతలు కొడుతున్నాడు. నిజమే కొట్టాల్సిన సందర్భమే. కష్టపడి పండించుకున్న ఆకలి ఒక్కటే తీర్చదు. కాస్తంత ఆత్మగౌరవాన్ని, మరింత ఆత్మసంతృప్తిని కూడా ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదమే ఇరవై ఏళ్ళ కెరీర్‌ని అలంకరించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఆకలిదప్పికలను ఈరోజున తీర్చింది. ఎప్పటికీ తీరుస్తూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్....బన్నీ

Ehatv
Next Story