ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , సుకుమార్(sukumar) కాంబినేషన్ లో..తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప2(Pushpa-2). పుష్ప సినిమాతో భారీ ఇమేను సాధించాడు బన్నీ.. దానిత పాటు జాతీయ అవార్డ్(National Award) కూడా సాధించాడు. దాంతో పుష్ప2ను మరింత భారీగాప్లాన్ చేస్తున్నారు టీమ్.

ఇక పుష్ప2ను అంతకు మించి ఆలోచనలో ఉన్నారు టీమ్. ఈసారి ఎలాగైనా ఆస్కార్ వరకూ(Oscar) వెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు బన్నీ. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ ను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ షెడ్యుల్ ను కంప్లీట్ చేసిన టీమ్.. తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ లు(Action Sequence) చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ వీక్ లో ఆల్మోస్ట్ రేపటి నుండి ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఈషెడ్యూల్ ను హైదరాబాద్(Hyderabad) లోనే ప్లాన్ చేస్తున్నారట టీమ్. అంతే కాదు ఈ షెడ్యూల్ లో పుష్ప2కి సబంధించిన యాక్షన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

అల్లు అర్జున్ ప్రస్తుతం వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ల వెడ్డింగ్ కోసం ఇటలీ కి వెళ్ళారు. పెళ్లి తర్వాత బన్నీ రిటర్న్ కానున్నారు. బన్నీ వచ్చేవరకూ అంతా రెడీ చేసుకుని.. ఆయన రాగానే షూటింగ్ ను స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఇక ఈమూవీలో అల్లుఅర్జున్ జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, ఫాహద్ ఫజిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Updated On 3 Nov 2023 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story