ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం(AP Deputy CM), పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)కు బర్త్‌ డే విషెస్‌(Birthday Wishes) చెప్పారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun).

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం(AP Deputy CM), పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)కు బర్త్‌ డే విషెస్‌(Birthday Wishes) చెప్పారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun).ఎక్స్‌ అకౌంట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 22వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న చిరంజీవికి కూడా బన్నీ విషెస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్‌, అల్లు అర్జున్‌ మధ్య ఓ రకమైన వార్‌ నడుస్తోంది. ఇటీవల మారుతీనగర్‌ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ చేసిన కామెంట్స్‌తో మెగా ఫ్యాన్స్‌ గరమయ్యారు. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోడానికి, ఎక్కడికైనా వెళ్లానికి తాను వెనుకాడనని బన్నీ చెప్పాడు. చెప్పను బ్రదర్‌ అంటూ అల్లు అర్జున్‌ చేసిన కామెంట్‌ అప్పట్టో సెన్సేషనల్ అయ్యింది. అప్పట్నుంచే పవన్‌ ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య సోషల్ మీడియాలో వార్‌ సాగుతూ ఉంది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇకనుంచైనా ఈ ఫ్యాన్స్‌ వార్‌కు తెరపడుతుందేమో వేచి చూడాల్సిందే.

ehatv

ehatv

Next Story