అల్లు అర్జున్ అంటే ఆ పిల్లోడికి అవధుల్లేని అభిమానం! అందుకే రాష్ట్రాల హద్దులు దాటేసి బన్నీని చూసేందుకు వచ్చాడు.
అల్లు అర్జున్ అంటే ఆ పిల్లోడికి అవధుల్లేని అభిమానం! అందుకే రాష్ట్రాల హద్దులు దాటేసి బన్నీని చూసేందుకు వచ్చాడు. అది కూడా సైకిల్ మీద! ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అలీఘడ్(Alighad)నుంచి 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్(Hyderabad)కు వచ్చాడు. విషయం తెలుసుకుని బన్నీ(Bunny) ఆశ్చర్యపోయాడు. ఆ అభిమానేమో అల్లు అర్జున్(Allu Arjun) చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీరు కార్చాడు. కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించాడు. అభిమానికి బన్నీ ఓ పూలకుండిని కానుకగా ఇచ్చాడు. వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లవద్దని, తాను ఫ్లయిట్ బుక్ చేస్తానని బన్నీ చెప్పి తన స్టాఫ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. సైకిల్‌ను ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పంపిస్తామన్నారు. దారి ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాడు. పుష్ప సినిమా ప్రమోషన్ కోసం ఉత్తరప్రదేశ్‌కు వస్తే తప్పనిసరిగా కలుస్తానని ఆ పిల్లోడికి మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.