జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని(Best Actor Award) అందుకున్న స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) తన ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన దినచర్య ఎలా మొదలవుతుందో చెప్పడంతో పాటు పుష్ప 2(Pushpa-2)సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను(Making Video) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో తన అభిమానుల గురించి చెప్పిన అల్లు అర్జున్‌ తనకు పుష్ప సినిమా ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో పుష్ప 2 షూటింగ్‌ జరుగుతోంది. పుష్ప 2 సెట్స్‌ను అభిమానులకు చూపించిన అల్లు అర్జున్‌ 'ఇతర దేశాలలో కంటే ఇండియాలో అభిమానులు చాలా భిన్నంగా ఉంటారు.

జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని(Best Actor Award) అందుకున్న స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) తన ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన దినచర్య ఎలా మొదలవుతుందో చెప్పడంతో పాటు పుష్ప 2(Pushpa-2)సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను(Making Video) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో తన అభిమానుల గురించి చెప్పిన అల్లు అర్జున్‌ తనకు పుష్ప సినిమా ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో పుష్ప 2 షూటింగ్‌ జరుగుతోంది. పుష్ప 2 సెట్స్‌ను అభిమానులకు చూపించిన అల్లు అర్జున్‌ 'ఇతర దేశాలలో కంటే ఇండియాలో అభిమానులు చాలా భిన్నంగా ఉంటారు. వారి ప్రేమను వివరించడం చాలా కష్టం. పుష్ప 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నా కోసం ఎంతో మంది అభిమానులు వచ్చారు. వీరి ప్రేమ నన్ను సరిహద్దులు అధిగమించేలా చేస్తోంది. నన్ను చూసి వారు గర్వపడేలా ఉంటాను. పుష్ప 2 నా 20వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇక పుష్పలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏదైనా ఉందంటే అది పుష్పరాజ్‌ పాత్రే. అతడు దేనికీ వెనకడుగు వేయడు' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇంకా ఈ వీడియోలో చిత్ర దర్శకుడు సుకుమార్‌ కూడా మట్లాడారు. పుష్ప 2 సినిమా తనకెంతో ప్రత్యేకమైనదని, షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. నిన్న సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్టు అల్లు అర్జున్‌ ఓ పోస్టు పెట్టారు. అప్పటి నుంచే అభిమానులు దాని కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. లేటెస్ట్‌గా పంచుకున్న ఈ వీడియోతో ఫ్యాన్స్‌ అంతా సంతోషపడుతున్నారు.

Updated On 30 Aug 2023 7:56 AM GMT
Ehatv

Ehatv

Next Story