తన మొదటి సినిమా విజేత అని.. ఆసినిమాలో తాను నటించినందకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని అన్నారు. అంతే కాదు ఈసినిమా ప్రొడ్యూసర్ నన్ననే అంటూ అల్లు అరవింద్ గురించి చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. నెక్ట్స్ పుష్ప2 ఆస్కార్ ను సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాతో టాలీవుడ్ కు ఫస్ట్ టైమ్ ఉత్తమ హీరోగా జాతీయ అవార్డ్ సాధించిపెట్టాడు అల్లు అర్జున్

తన ఫస్ట్ మూవీకి తనకు అసలు డబ్బులివ్వలేదు అంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). అంతే కాదు తన మొదటి సినిమా నిర్మాత ఎవరో కాదు.. తన తండ్రి అల్లు అరవింద్(Allu Arvind) అంటూ మరో షాక్ కూడా ఇచ్చాడు. తన మొదటి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

తాజాగా అల్లు అర్జున్ తన ఇన్ స్టా గ్రామ్(Instagram) స్టేటస్ లో ఓం ఇంట్రెస్టింగ్ న్యూస్ శేర్ చేసుకున్నాడు. తన తండ్రి విజేత సినిమా షీల్డ్ ను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశాడు అల్లు అర్జున్. ఆ షీల్డ్ లో అల్లు రామలింగయ్య ఫోటో కూడా ఉంది. ఆ షీల్డ్ ఏదో కాదు.. విజేత సినిమా 100 రోజులు వేడుకలకు సబంధించింది. అయితే ఈ ఫోటో గురించి ఇంట్రె్టింగ్ విఫయాలు వెల్లడించాడు బన్నీ.

తన మొదటి సినిమా విజేత అని.. ఆసినిమాలో తాను నటించినందకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని అన్నారు. అంతే కాదు ఈసినిమా ప్రొడ్యూసర్ నన్ననే అంటూ అల్లు అరవింద్ గురించి చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. నెక్ట్స్ పుష్ప2 ఆస్కార్ ను సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాతో టాలీవుడ్ కు ఫస్ట్ టైమ్ ఉత్తమ హీరోగా జాతీయ అవార్డ్ సాధించిపెట్టాడు అల్లు అర్జున్

ఇక విజేత సినిమాలో వెంకటేష్ అనే క్యారెక్టర్ లో నటించాడు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ఈమూవీని అల్లు అరవింద్ నిర్మించారు. అల్లు రామలింగయ్య కూడా ఈమూవీలో నటించారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన కోదండరామిరెడ్డి విజేత సినిమాను డైరెక్ట్ చేయగా.. భానుప్రియ హీరోయిన్ గా నటించింది. ఈమూవీ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Updated On 25 Dec 2023 8:34 AM GMT
Ehatv

Ehatv

Next Story