ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల్లో భారీ స్వీక్వెల్ సినిమా ఏదంటే పుష్క-2. ఆ సినిమా పార్ట్ వన్ పే..ద్ద హిట్ అవ్వడంతో కామన్ ఆడియన్స్ లోనూ ఇటు ఫ్యాన్స్ లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. అలాంటి ఐకాన్ స్టార్ తో సినిమాతో చేయాలంటే కాస్త హై వోల్టేజ్ అవసరమనే చెప్పాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు సందీప్ రెడ్డి వంగ అండ్ అల్లు అర్జున్ కాంబో రానేవచ్చింది. అయితే సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో […]

ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల్లో భారీ స్వీక్వెల్ సినిమా ఏదంటే పుష్క-2. ఆ సినిమా పార్ట్ వన్ పే..ద్ద హిట్ అవ్వడంతో కామన్ ఆడియన్స్ లోనూ ఇటు ఫ్యాన్స్ లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. అలాంటి ఐకాన్ స్టార్ తో సినిమాతో చేయాలంటే కాస్త హై వోల్టేజ్ అవసరమనే చెప్పాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు సందీప్ రెడ్డి వంగ అండ్ అల్లు అర్జున్ కాంబో రానేవచ్చింది.

అయితే సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ సృష్టించాడు. ఆ తర్వాత అదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ పవరేంటో చూపించాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ గా సత్తా చాటాడు మనోడు.

ఇక సందీప్ రెడ్డి వంగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి కొలాబురేట్ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా రాబోతున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ మూవీని టీ.సిరీస్ భూషణ్ కుమార్ అండ్ అలాగే సందీప్ రెడ్డి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి ఇప్పటికే ‘యానిమల్’ సినిమాపై అప్పుడప్పుడు ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ.. సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాపై అనౌన్స్ మెంట్ అందులోనూ టి.సిరీస్ తో కలిసి సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఇటు బాలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఇంకాస్త భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తుండటంతో సందీప్ రెడ్డి ఆలోచనలను అందుకోలేకపోతున్నారు ఆడియన్స్.

మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నారు ఈ అర్జున్ రెడ్డి డైరెక్టర్. ఇటు యానిమల్, స్పిరిట్ సినిమాలు పూర్తయ్యాకే అంటే 2025లో ఐకాన్ స్టార్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 3 March 2023 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story