ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు(Allu Arjun) ఇప్పడు దేశమంతటా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయనిప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. అల్లు అర్జున్‌ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. పుష్ప(Pushpa) సినిమాతో ఆయన పేరు ప్రతిష్టలు దేశం మొత్తం విస్తరించాయి. సినిమాలోని పాటలు విదేశాల్లోనూ మారుమోగాయి. ప్రస్తుతం ఆయన పుష్ప పార్ట్‌-2లో నటిస్తున్నారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు(Allu Arjun) ఇప్పడు దేశమంతటా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయనిప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. అల్లు అర్జున్‌ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. పుష్ప(Pushpa) సినిమాతో ఆయన పేరు ప్రతిష్టలు దేశం మొత్తం విస్తరించాయి. సినిమాలోని పాటలు విదేశాల్లోనూ మారుమోగాయి. ప్రస్తుతం ఆయన పుష్ప పార్ట్‌-2లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రాజకీయ నాయకుడి కూతురు స్నేహరెడ్డిని(Sneha Reddy) అల్లు అర్జున్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయాన్‌(Ayan), అర్హ(Arha). అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. పిల్లలతో బన్నీ సరదా ముచ్చట్లు, చేష్టలు, వెకేషన్‌కు వెళ్లినప్పటి ఫోటోలు, తనకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మనం అల్లు అర్జున్‌కు స్నేహరెడ్డినే మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ అని అనుకున్నాం. కానీ కాదట. బన్నీకి స్నేహ కంటే ముందు గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారట. ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా చెప్పారు. పైగా వారిలో తన ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరును కూడా రివీల్‌ చేసేశారు బన్నీ. ఆహాలో(Aha) ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-2 (Indian Idol) ఫైనల్స్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. కంటెస్టెంట్లలో శ్రుతి(Shruthi) అనే సింగర్‌ పాట పాడిన అనంతరం బన్నీ కాసేపు ఆమెతో ముచ్చటించారు. 'నీ పేరు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ పేరు కూడా శ్రుతినే' అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 30 May 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story