మీ ప్రేమకు కృతజ్ఞుడిని.. అల్లు అర్జున్. బన్నీని బావా అని ఎన్టీఆర్ విషెష్.. ట్రెండింగ్ లో కి వచ్చిన బావ పదం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శనివారం తన 41వ పుట్టిన రోజును జరుపుకున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

మీ ప్రేమకు కృతజ్ఞుడిని.. అల్లు అర్జున్(Allu Arjun). బన్నీని బావా అని ఎన్టీఆర్(NTR) విషెష్.. ట్రెండింగ్ లో కి వచ్చిన బావ పదం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శనివారం తన 41వ పుట్టిన రోజును జరుపుకున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆర్ఆర్ఆర్ స్టార్ ఎన్టీఆర్‌ చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

40 ఏళ్ళు పూర్తి చేసుకుని 41 లోకి ఎంటర్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, శుభాకాంక్షలకు చాలా చాలా థ్యాక్స్.. . నేను నిజంగా ధన్యుడిని. ఎప్పటికీ కృతజ్ఞుడిని అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇక అందరికంటే కాస్త లేట్ గా విష్ చేశారు ఎన్టీఆర్. లేట్ గా విష్ చేసినా.. డిఫరెంట్ గా చేశారు. బావా అంటూ అల్లు అర్జున్‌ ను ఎన్టీఆర్ పిలిచి పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరి మద్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు బావా అనే పదం ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చిందతి ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందంటే.. విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ..హ్యాపీ బర్త్‌డే బావ.. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చాడు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా.. నీకు నా వామ్ హగ్స్‌.. అని సమాధానమిచ్చారు. దీనిపై ఎన్టీఆర్‌ .. కేవలం హగ్స్‌ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?( అంటూ స్మైలీ ఎమోజీని యాడ్‌ చేశారు. దీనికి బన్నీ.. వస్తున్నా అని రాస్తూ.. కన్ను గీటే ఎమ్మెజీని ఇచ్చారు. ప్రస్తుతం వీరి కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిత. .

ఇక బన్నీ పుష్ప సీక్వెల్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన డిఫరెంట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతా ఈ లుక్ గురించే మాట్లాడుకుటున్నారు. ఈమూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. సుకుమర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను మరోసారి పాన్ ఇండియా టార్గెట్ గా బన్నీ తీసుకెళ్లబోతున్నాడు. పుష్పతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ.. పుష్ప2ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు.

Updated On 9 April 2023 11:13 PM GMT
Ehatv

Ehatv

Next Story