హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టయి,

హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టయి, బెయిల్ పై విడుదలైన హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra babu) పరామర్శించారు. శనివారం సాయంత్రం ఫోన్ చేసి అరెస్టుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు బన్నీని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వచ్చారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేందర్‌రావు, దర్శకుడు సుకుమార్, త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజ్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్ నిర్మాతలు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బన్ని వాసు, నిర్మాత ఎస్‌కేఎన్, రానా దంపతులు, పుష్ప టీమ్ సభ్యులు అల్లు అర్జున్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు, చిరంజీవి భార్య, మేనత్త సురేఖ తదితరులు అర్జున్‌ను కలిశారు.
