ఇంతకు ముందు కూడా మనలో బోలెడంత క్రియేటివిటీ ఉండింది గానీ దానిని ప్రదర్శించుకునేందుకు ఫ్లాట్ ఫామ్ లేకపోయేది.

ఇంతకు ముందు కూడా మనలో బోలెడంత క్రియేటివిటీ ఉండింది గానీ దానిని ప్రదర్శించుకునేందుకు ఫ్లాట్ ఫామ్ లేకపోయేది. అందుకే దోస్తులతో చెప్పుకుని సంబరపడేవాళ్ళం. సోషల్‌ మీడియా వచ్చాక ఆ కొరత తీరింది. వార్తలు అలవోకగా వండే వారు చాలా మంది తయారు అయ్యారు. ఇందులో చాలా మట్టుకు అబద్ధాలే ఉండటంతో జనం కూడా టైం పాస్ కోసం చదివేసి లైట్ తీసుకుంటున్నారు.

తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నది. అది పుష్ప సినిమా గురించి కావడం గమనార్హం . పుష్ప 2’ హిట్‌ కావడం తో పుష్ప3 గురించి చర్చించుకుంటున్నారు. పుష్ప2 ముగింపులో పుష్ప 3-ర్యాంపేజ్‌(PushpaRampage) అంటూ మూడో పార్ట్‌ని దర్శకుడు సుకుమార్‌(sukumar) ప్రకతించారు. దాంతో సుకుమార్ కంటే ముందే ‘పుష్ప 3 పై కథలు అల్లేస్తున్నారు. సోషల్ మీడియా లో సర్క్యులేట్ అవుతున్న ‘పుష్ప 3’ కథలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ఉంటున్నాడు. బాంబ్‌ బ్లాంస్టింగ్‌లో శ్రీవల్లి మినహా పుష్పరాజ్‌ అండ్‌ ఫ్యామిలీ చనిపోతారట. శ్రీవల్లికి విజయ్‌ దేవరకొండ పుడతాడట. మూడో పార్టంతా దేవరకొండ చుట్టూనే తిరుగుతుందట. ఇందులో నిజం ఎంతుందో తెలీదుకానీ.. వార్త మాత్రం బలంగానే వినిపిస్తున్నది. వినడానికి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఏమో ఇది నిజం కూడా కావొచ్చు.

ehatv

ehatv

Next Story