అల్లు అర్జున్(Allu Arjun)కు మరో అరుదైన గౌరవం లభించబోతున్నది. దుబాయ్(Dubai)లోని మేడమ్ తుస్సాడ్స్(Madame Tussauds)లో బన్నీ మైనపు బొమ్మ(wax statue)ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు అల్లు అర్జున్ శరీరపు కొలతలను తీసుకున్నారు. ఆయన బొమ్మ అచ్చుగుద్దినట్టు వచ్చేందుకు దాదాపు 200 కొలతలు తీసుకున్నారట!

Allu Arjun Wax Statue
అల్లు అర్జున్(Allu Arjun)కు మరో అరుదైన గౌరవం లభించబోతున్నది. దుబాయ్(Dubai)లోని మేడమ్ తుస్సాడ్స్(Madame Tussauds)లో బన్నీ మైనపు బొమ్మ(wax statue)ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు అల్లు అర్జున్ శరీరపు కొలతలను తీసుకున్నారు. ఆయన బొమ్మ అచ్చుగుద్దినట్టు వచ్చేందుకు దాదాపు 200 కొలతలు తీసుకున్నారట! ఇటీవల అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించిన విషయం విదితమే! అవార్డును అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు ఆయనే! ఇప్పుడు ఆయన బొమ్మ మేడమ్ తుస్సాడ్స్‌లో కొలువు తీరనుంది. ఈ మైనపు బొమ్మ ఆవిష్కరణ వచ్చే ఏడాది ఉంటుందట! అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియోను నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. కాగా, దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో తెలుగు నుంచి ప్రదర్శితం కానున్న తొలి మైనపు బొమ్మ అల్లు అర్జున్‌దే కావడం విశేషం.
