అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2 The Rule) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2 The Rule) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే అన్ని రికార్డులు బద్దలయ్యాయి.పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన‌ ఈ సినిమాకు కూడా సుకుమారే(Sukumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌ష్మిక మందన్నా(Rashmika mandanna) క‌థానాయిక‌గా న‌టించింది. ప్రీమియ‌ర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది. అయితే ఈ సినిమాలో సెకండ్ ఆఫ్‌లో వ‌చ్చే ‘గంగో రేణుక తల్లి’ జాత‌ర సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అంటున్నారు. జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాల‌కు పైగా ఉన్న ఈ సీన్ బ‌న్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ జాత‌ర సీన్ వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్ల‌లో ప‌లువురు మ‌హిళ‌ల‌కు అమ్మ‌వారు పూనింది. జాత‌ర పాట వ‌స్తుంటే.. అమ్మవారు పూన‌డంతో ప‌క్క సీట్ల‌లో ఉన్న ప్రేక్ష‌కులు వారిని శాతింప‌జేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ehatv

ehatv

Next Story