యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా.. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో సినిమా ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాతో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా.. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో సినిమా ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాతో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ ఇది 30వ సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువ సుధా ఆర్ట్స్(Yuva Sudha Arts) వారు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యి జోరుగాసాగుతోంది. అయితే ఈసినిమాపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈక్రమంలో ఈమూవీ టైటిల్ కూడా ఖరారు అయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి .

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను అఫీషియల్ గా ఖరారు చేయలేదు. అవసరమైన చోట ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ ను వాడేస్తున్నారు. మీడియా కూడా ఎన్టీఆర్ 30 అనే రాస్తున్నారు. ఈక్రమంలో ఈసినిమాకు 'వస్తున్నా' అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా 'పార్టీ లేదా పుష్ప' అని ఎన్టీఆర్ అడిగితే, 'వస్తున్నా' అని బన్నీ సమాధానమిచ్చాడు.

దాంతో అప్పటి నుంచి ఇదే ఆ సినిమా టైటిల్ అయ్యుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. టైటిల్ ను అల్లు అర్జున్ ముందే రివిల్ చేశాడని.. అది అందరూ గమనించలేకపోతున్నారంటూ.. సోషల్ మీడియా గుర్తు చేస్తుంది. అంతే కాదు బన్నీకి ముందుగా ఆ టైటిల్ గురించి తెలియడం వల్లనే ఆయన ఆ మాటను ఉపయోగించాడని అంటున్నారు. ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ విలన్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు.

Updated On 12 April 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story