కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అకృత్యాలను భరించలేక బయటకు వచ్చేసిన బాధితురాలికి తెలుగు సినీ పరిశ్రమ అండగా నిలిచింది.
జానీ మాస్టర్ బాధితురాలికి అల్లు అర్జున్ అండదండలు!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అకృత్యాలను భరించలేక బయటకు వచ్చేసిన బాధితురాలికి తెలుగు సినీ పరిశ్రమ అండగా నిలిచింది. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, పూనమ్ కౌర్ వంటి నటీమణులు బాధితురాలికి మద్దతు ఇచ్చారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా బాసటగా నిలిచింది. లేటెస్ట్‌గా అల్లు అర్జున్ కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చాడు. తన సినిమాల్లో ఆమెకు అవకాశం ఇస్తా అన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తను చేయబోయే అన్ని సినిమాలకు వర్క్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన అల్లు అర్జున్ మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. ఆయన నటించబోయే సినిమాల్లో కొరియోగ్రాఫ్ చేసే ఆఫర్ ఇచ్చి బాధితురాలికి చేయూతనిచ్చారు. దీంతో ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు. మానసికంగా భరోసానిచ్చినట్లయ్యింది. ఇప్పటికే ఆమె పుష్ప 2లో పనిచేశారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కష్టకాలంలో బాధితురాలికి అండగా నిలిచారంటూ అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తున్నారు. .