సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులర్ బెయిల్ రాలేదు.

సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులర్ బెయిల్ రాలేదు. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కానీ ఆ బెయిల్ కు కండిషన్స్ అప్లై అని ట్యాగ్ లైన్ ఇచ్చింది నాంపల్లి కోర్టు.

సాధారణంగానే బెయిల్ కు పూచీకత్తు అడుగుతారు. అలాగే అల్లు అర్జున్ కు 50 వేల చొప్పున రెండు పూచీకత్తు ఇవ్వాల్సిందిగా.. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా సాక్ష్యులను ప్రభావితం చేయొద్దు. అన్నిటి కన్నా ముఖ్యంగా ఒక షరతు అర్జున్ ను ఇబ్బందిపెట్టే విధంగా ఉంది.

బెయిల్ కండిషన్స్ లో భాగంగా ఆయన ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరవలేకపోతే పోలీస్ లకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ సండే బన్నీ స్టేషన్ కి రావాలనమాట.

ehatv

ehatv

Next Story