అదేమిటో కానీ ఇప్పుడు మెగా కాంపౌండ్‌కు అల్లు అర్జున్‌కు(Allu arjun) అసలు పడటం లేదు.
అదేమిటో కానీ ఇప్పుడు మెగా కాంపౌండ్‌కు అల్లు అర్జున్‌కు(Allu arjun) అసలు పడటం లేదు. పవన్ కల్యాణ్(Pawan kalyan) రాజకీయ ప్రవేశం నాటి నుంచే ఈ రెండు కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. అబ్బే ఇవన్నీ తప్పుడు వార్తలు.. మా మధ్యన ఏమీ లేదని అప్పుడప్పుడు ఆ రెండు కుటుంబాలు ఖండిస్తూ ఉంటాయి. మొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం(Pithapuram) వెళ్లి ప్రచారం చేయకుండా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YCP) చెందిన మిత్రుడు శిల్పా మోహన్‌రెడ్డి(Shilpa mohan reddy) కోసం వెళ్లడం సంచలనమయ్యింది. మెగా కాంపౌండ్‌లో దుమారమే చెలరేగింది. నాగబాబు(Nagababu) ఓ ట్వీట్ చేసి వెంటనే దాన్ని డిలీట్ కూడా చేశాడరు. పవన్, బన్నీ మధ్య గ్యాప్ చాలా పెద్దదయ్యింది. ఇదిలా ఉంటే ఇటీవల బెంగళూరుకు వెళ్లిన పవన్ కల్యాణ్ సినిమాలో హీరోల పాత్రల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల కిందట హీరోలు అటవీ సంపదను రక్షించేవారని, ఇప్పుడు అదే హీరోలు అడవిలో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. ఇవి అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని ఇట్టే అర్థమవుతోంది. బన్నీ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్‌కు పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి(Kancharla chandrashekar reddy) కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ వివాదంలో పవనే వివరణ ఇస్తే బాగుంటుందన్నారు.
'ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జున్ నటించాడనే విషయం పవన్ కల్యాణ్‌కు కూడా తెలుసు కదా.. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఇప్పటికైన పవన్ జోక్యం చేసుకుని తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదని చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ వచ్చింది పాలిటిక్స్‌లో కాదు.. సినిమాల్లో అని గుర్తుంచుకోవాలి. పైగా అందులో రాజకీయాలు కూడా ఏమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ మిత్రపక్షం బీజేపీనే అన్నది మర్చిపోవద్దు. అల్లు అర్జున్ చాలా మెచ్యూర్ నటుడు. తను సినిమాల్లో మాత్రమే ఉన్నారని గ్రహించాలి. ఆయన అభిమానులకు, స్నేహితులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. నమ్మిన వారి కోసమే బన్నీ ఉంటారు' అని కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.