ఇంకోసారి ఇలా చేస్తే పగిలిపోద్ది.. అసలేమనుకుంటున్నావ్ నువ్వు అంటూ.. జబర్థస్త్ అవినాష్(Jabardast Avinash) కు మాస్ వార్నింగ్ స్ట్రాంగ్ గా ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్...

ఇంకోసారి ఇలా చేస్తే పగిలిపోద్ది.. అసలేమనుకుంటున్నావ్ నువ్వు అంటూ.. జబర్థస్త్ అవినాష్(Jabardast Avinash) కు మాస్ వార్నింగ్ స్ట్రాంగ్ గా ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్... ఇంతకీ అవినాష్ మీద అంత కోపం ఎందుకు వచ్చింది ప్యాన్స్ కు.

తాముఅభినానించే స్టార్ హీరోలకు ఏమన్నా అన్నారంటే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి. అది సెలబ్రిటీలు అయినా... సామాన్యులు అయినా.. ఫ్యాన్స్ వదిలిపెట్టరు. సోషల్ మీడియాలో వార్నింగ్స్ ట్రోలింగ్స్.. తప్పవు.. ఇక ప్రస్తుతం ఈ పరిస్థితి జబర్థస్త్ ముక్కు అవినాశ్(avinash) కు వచ్చింది. అవినాశ్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జబర్దస్త్ అవినాష్.. తనదైన కామెడి టైమింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇక బిగ్ బాస్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. దాంతో అవినాష్ కు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఈమధ్యే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. పుష్ప2 నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. అయితే ఆ పుష్ప2 పోస్టర్ ను ఎడిగటింగ్ చేశారు అవినాష్ అది కూడా తన ఫోటోతో... వివాదం అయ్యింది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా.. పుష్ప2 నుంచి టీజర్ తో పాటుగా.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు సుకుమార్ టీమ్. అమ్మవారి రూపంలో బన్నీ ఊర మాస్ పిక్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి షాక్ అయ్యారు.

ఈ పోస్టర్ ను అవినాష్ తన ఫోటోతో మార్పింగ్ చేవాడు. తన ఫోటోతో కలిపి.. ఎడిటింగ్ చేశారు. అంతే కాదు గొప్పగా.. ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫోటో పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ కు బర్త్ డే విషెష్ కూడాచెప్పాడు అవినాష్. ఇప్పుడు ఈ ఫోటోనే అవినాష్ కు తిప్పలు తెచ్చింది. ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్ కు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అర్జెంట్ గా ఆ పిక్ ను డిలీట్ చెయ్.. ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేయకు. ఇక అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జెంట్ గా డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్ది అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్.

Updated On 11 April 2023 11:51 PM GMT
Ehatv

Ehatv

Next Story