అభిమానానికి ఓ లిమిట్ అంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో అయినా.. బయట చర్చించుకున్నా

అభిమానానికి ఓ లిమిట్ అంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో అయినా.. బయట చర్చించుకున్నా ఏదో టైమ్ పాస్ లాగా ఉండాలి తప్ప.. వ్యక్తిగతంగా దాడులు చేసుకునే దాకా ఉండకూడదు. ఇలాంటి ఘటనలు ఆయా హీరోలకే తలవంపులు తెస్తూ ఉంటాయి. మాటా మాటా అనుకుని.. రక్తాలు వచ్చేలా కొట్టుకునే దాకా వెళ్లారంటే మాత్రం వాళ్లను అభిమానులు అనరు.. ఇంకేవేవో పదాలతో పిలవాల్సి వస్తుంది. తాజాగా ఇద్దరు అభిమానులకు సంబంధించిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 'జై అల్లు అర్జున్ అను.. విడిచిపెడతాను' అంటూ కన్నడలో ఓ యువకుడు మరో యువకుడిని కొడుతూ ఉన్న వీడియో గురించి చర్చించుకుంటూ ఉన్నారు.

ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుందని చెబుతున్నారు. కొందరు యువకులు ఓ వ్యక్తిని చొక్కాను చింపేసి రక్తం వచ్చేలా కొట్టారు. ఆ దెబ్బలు తింటున్న వ్యక్తి చేతిలో బ్యాట్ కూడా అంది. జై అల్లు అర్జున్‌ అను.. అంటూ అక్కడున్న కొందరు ఓ యువకుడిపై దాడి చేస్తూ కనిపించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బెంగళూరు పోలీసులను కొందరు ట్యాగ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On 10 March 2024 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story