దేశ వ్యాప్తంగా ఊహించని విజయం సాధించిన సినిమా 'పుష్ప'. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకున్నారు.
దేశ వ్యాప్తంగా ఊహించని విజయం సాధించిన సినిమా 'పుష్ప(Pushpa)'. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు(Best Actor)గా అల్లు అర్జున్(Allu Arjun), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్(Devisri Prasad) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) నుంచి పురస్కారాలు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) చిత్రానికి కూడా జాతీయ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో నేషనల్ అవార్డు విన్నర్స్ కు మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) చిత్ర నిర్మాణ సంస్థ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. జాతీయ అవార్డు(National Award) అందుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకూ అవార్డు రావాలని సుకుమార్(Sukumar) మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అచీవర్.. నేను కేవలం అఛీవ్‌మెంట్ మాత్రమేనని తెలిపారు. జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే జరుగుతుందని అన్నారు అల్లు అర్జున్. నాతో పాటు దేవి శ్రీ ప్రసాద్ కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో మా నాన్న చాలా సంతోషపడ్డారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్టు ఉంది అంటూ పొంగిపోయారని అల్లు అర్జున్ తెలిపారు. ఎందుకంటే ఇవాళ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి లేకపోవచ్చు... దేవి కూడా నా బిడ్డ లాంటివాడే... అతడు అవార్డు అందుకోవడాన్ని నేను చూడాలి అంటూ నాన్న అల్లు అరవింద్ ఢిల్లీకి వచ్చారని తెలిపాడు అల్లు అర్జున్. నాకు జాతీయ అవార్డు వచ్చినందుకు ఎంత ఆనంద పడ్డారో, అంతే సమానంగా, దేవికి అవార్డు వచ్చినందుకు కూడా ఆనందపడ్డారు. అప్పుడు నేను మా నాన్నతో అన్నాను.. నాన్నా నీ భాషలో చెప్పాలంటే.. చెన్నైలో ఇద్దరు పోరంబోకులు... కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద సర్టిఫికెట్లు కూడా తీసుకోని వాళ్లం.. ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకున్నావా? అని అడిగానంటూ అల్లు అర్జున్ అందరినీ నవ్వించారు.