నేషనల్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) దుబాయ్‌లో(Dubai) ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్ ట్రిప్ వేశారు. అక్కడి మేడమ్ టుస్సడ్స్ మ్యూజియంలో(Madame Tussauds Museum) తన మైనపు బొమ్మ(Wax Idol) ఆవిష్కరణ కార్యక్రమనికి బన్నీ హాజరుకానున్నారు. పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా అంతటా పాకింది.

Allu Arjun
నేషనల్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) దుబాయ్‌లో(Dubai) ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్ ట్రిప్ వేశారు. అక్కడి మేడమ్ టుస్సడ్స్ మ్యూజియంలో(Madame Tussauds Museum) తన మైనపు బొమ్మ(Wax Idol) ఆవిష్కరణ కార్యక్రమనికి బన్నీ హాజరుకానున్నారు. పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా అంతటా పాకింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు(National Award) లభించిన తర్వాత అతడి పాపులారిటీ అమాంతం పెరిగింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడమన్నది ఆయనకు లభించిన గౌరవం. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు జరగనుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే ఇవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. బన్నీ మైనపు విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ మ్యూజియంలో ఇప్పటి వరకు దక్షిణ భారతానికి చెందిన నటుల విగ్రహాలు లేవు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అన్నట్టు దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే ! రాజకీయ ప్రముఖులు, సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారు. ఈ మ్యూజియంకు సింగపూర్, లండన్, దుబాయ్.. ఇలా వివిధ చోట్ల బ్రాంచులు ఉన్నాయి. దుబాయ్‌లోని మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి.
