అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అతి త్వరలో వీరి కాంబోలో మరో సినిమా రాబోతున్నది.

అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అతి త్వరలో వీరి కాంబోలో మరో సినిమా రాబోతున్నది. పుష్ప-2 (pushpa-2)తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదే! బన్నీతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు. కొందరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. కాకపోతే బన్నీ మాత్రం త్రివిక్రమ్‌(Trivikram)తోనే సినిమా చేయడానికి ఫిక్స్‌ అయ్యారు. అల్లు అర్జున్‌(Allu Arjun)తో ఇంతకు ముందు జులాయి(Julai), సన్నాఫ్‌ సత్యమూర్తి(S/o Sathyamurthi), అల వైకుంఠపురము(Ala Vaikuntapuram)లో సినిమాలు తీశారు త్రివిక్రమ్‌. మూడూ భిన్నమైన సినిమాలు. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా హవా నడుస్తున్నది కాబట్టి త్రివిక్రమ్‌ కూడా ఆ మార్గంలో పయనించాలని అనుకుంటున్నాడు. బన్నీతో తీయబోయే సినిమా కేవలం తెలుగుకే పరిమితం చేయకూడదని డిసైడయ్యారు. దేశమొత్తం కనెక్ట్‌ అయ్యేట్టుగా కథ రాసుకుంటున్నారు త్రివిక్రమ్‌. ఇప్పటి వరకు తివ్రిక్రమ్‌ తీసిన సినిమాలన్నీ ఫ్యామిలీ బేస్డ్‌ సినిమాలు. ఇప్పుడు అలా తీస్తే కుదరదు. కొత్తగా ఏదైనా చెప్పాలి. త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు. మైథలాజికల్‌ టచ్‌ సోషియో ఫాంటసీ కథను అల్లుతున్నాడు. లైన్‌ బన్నీకి బాగా నచ్చేసిందట కూడా! ఇప్పుడా లైన్‌ను పూర్తి కథగా మలుస్తున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని-గీతా(Harika Hasini-Geetha) కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సినిమాకు మినిమమ్‌ అయిదు వందల కోట్ల రూపాయలు అవుతుందని అనుకుంటున్నారు.

ehatv

ehatv

Next Story