పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప2: ది రూల్ కోసం రెడీగా ఉన్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‏లో ఈ సినిమా గురించి చాలా కొత్తగా టాక్స్ నడిచాయి. సుకుమార్(sukumar) డైరెక్షన్‏లో తెరకెక్కిన ఈ సినిమా సెకండ్ పార్ట్‏పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందే వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప2: ది రూల్ కోసం రెడీగా ఉన్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‏లో ఈ సినిమా గురించి చాలా కొత్తగా టాక్స్ నడిచాయి. సుకుమార్(sukumar) డైరెక్షన్‏లో తెరకెక్కిన ఈ సినిమా సెకండ్ పార్ట్‏పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కంటే ముందే వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అవును మీరు చదివింది నిజమే.. ! సుకుమార్ (Sukumar) తన పెర్ఫెక్ట్ ప్లానింగ్‏తో ఆడియన్స్‏కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‏ను బిగ్ స్క్రీన్‏పై తీసుకురావడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. సో డిసెంబర్ 2023లో పుష్ప2 విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సుకుమార్ హడావిడిగా షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా లేడు కాబట్టి ఈ సినిమాను 2024 మే లేదా ఆ తర్వాత రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విడుదల డేట్ను మే లేదా జులై మధ్య‏లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మే (May) నెలకు ముందే రిలీజ్ చేసే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు.

ఫస్ట్ పార్ట్‏కు ప్రపంచ వ్యాప్తంగా మాంచి.. రెస్పాన్స్ రావడంతో.. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప ది రూల్ (Pushpa2: The Rule) ఇప్పుడు ఆల్ టైమ్ హై రేంజ్‏కి చేరుకుంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో భూషణ్ కుమార్ (Bhushan Kumar) నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే అంతకంటే ముందు సందీప్ రెడ్డి వంగా రణ్‏బీర్ కపూర్ చిత్రం, ప్రభాస్‏తో స్పిరిట్ చిత్రాలు ఉండటంతో బన్నీ చేయబోయే ప్రాజెక్టుకు మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated On 24 May 2023 11:39 PM GMT
Ehatv

Ehatv

Next Story