నేషనల్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటిస్తున్న పుష్ప -2(Pushpa-2) సినిమాపై అభిమానులు బోల్డన్నీ ఆశలు పెట్టుకున్నారు.

నేషనల్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటిస్తున్న పుష్ప -2(Pushpa-2) సినిమాపై అభిమానులు బోల్డన్నీ ఆశలు పెట్టుకున్నారు. మొదటి భాగం అనూహ్య విజయం సాధించడంతో దర్శకుడు సుకుమార్‌(Sukumar) బాధ్యత మరింత పెరిగింది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందిస్తున్నారు సుకుమార్‌. మొదటి పార్ట్‌ కంటే రెండో పార్ట్‌ను మరింత పవర్‌ఫుల్‌గా తయారుచేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కాకపోతే షూటింగ్‌లో ఆలస్యం జరగడంతో విడుదల తేదీ వాయిదా పడింది. డిసెంబర్‌ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామని చాన్నాళ్ల కిందటే మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మధ్యన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేయనున్నారని కొందరు అంటుంటే, సంక్రాంతికి రావచ్చని మరికొందరు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇలా రకరకాల వార్తలు వస్తుండటంతో మేకర్స్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన మేకర్స్‌ డిసెంబర్‌ 6వ తేదీన రావడం పక్కా అని చెప్పారు. అలాగే రిలీజ్ కు ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 5 న రాత్రి 9:30 గంటలకు రెండు తెలుగు రాష్టాల్లో ప్రీమియర్స్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మైత్రీ నిర్మాతలు. హనుమాన్ చిత్ర స్ట్రాటజీని ఫాలో అవుతూ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story