జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ తమ పోలింగ్ బూత్‌లకు

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ తమ పోలింగ్ బూత్‌లకు ఓటు వేయడానికి ముందుగానే చేరుకున్నారు. అల్లు అర్జున్ ఒంటరిగా రాగా, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, ఆయన తల్లి షాలిని కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తమ పోలింగ్ బూత్‌ల వద్ద ఇద్దరు నటీనటులు క్యూలో నిలబడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ఉదయాన్నే తన ఓటు వేశారు. హైదరాబాద్ సిటీలో తనకు కేటాయించిన పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్‌లో సామాన్యుడిలా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. తనకు ఏ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. "దయచేసి ఓట్లు వేయండి. ఇది చాలా బాధ్యతాయుతమైన రోజు. మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది" అని ఆయన అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు.. తటస్థంగా ఉంటాను. నాతో సన్నిహితంగా ఉండే వారందరికీ అండగా ఉంటాను. మామయ్య, నా స్నేహితుడు, మామగారు అందరూ రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల ప్రచారానికి సంబంధించి నేను నా స్నేహితుడికి చాలా కాలం క్రితం మాట ఇచ్చాను, అందుకే నేను, నా భార్య అతనిని వ్యక్తిగతంగా కలిశామని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

Updated On 12 May 2024 9:25 PM GMT
Yagnik

Yagnik

Next Story