✕
Allari Naresh Ugram Movie : ఉగ్రం...పూర్తిగా అల్లరి నరేష్ సింగిల్ మేన్ షో
By EhatvPublished on 5 May 2023 7:09 AM GMT
ఉగ్రం సినిమా రివ్య్యూ రాయడంలో ఓ సౌకర్యం కలిగింది. సినిమా మొత్తం గురించి రాయనక్కర్లేదు. ఒక్క అల్లరి నరేష్ గురించి రాస్తే చాలు. సరిపోతుంది. కామెడీకి మార్కు పడిన ఏ హీరో కూడా ఇటువంటి యాక్షన్ ఓరియంటెడ్, ఎమోషనల్ పెరపారమెన్స్ని ఒప్పించడం అంత ఈజీ కానేకాదు.

x
ugram movie
-
- ఉగ్రం సినిమా రివ్య్యూ రాయడంలో ఓ సౌకర్యం కలిగింది. సినిమా మొత్తం గురించి రాయనక్కర్లేదు. ఒక్క అల్లరి నరేష్ గురించి రాస్తే చాలు. సరిపోతుంది. కామెడీకి మార్కు పడిన ఏ హీరో కూడా ఇటువంటి యాక్షన్ ఓరియంటెడ్, ఎమోషనల్ పెరపారమెన్స్ని ఒప్పించడం అంత ఈజీ కానేకాదు. ఓ పక్కన ఓ సిన్సియర్ కాప్‌గా ఉంటూ, మిస్సింగ్ కేసుల గురించే ఆవేదన పడుతున్న హీరో క్యారెక్టర్ తన భార్య, కూతురు కూడా మిస్ అయిపోతే, మరోవైపున మతి తప్పిపోతూ చివరిదాకా పోరాడే పాత్రను అల్లరి నరేష్ చాలా ఛాలెంజ్‌గానే తీసుకుని చేశాడు.
-
- అఫ్కోర్స్...మహర్షి, నాంది సినిమాలతో నరేష్ కొత్తపుంతలు తొక్కినా అందులో రాణించి, దర్శకరచయితలకు తనకోసం కొత్తపాత్రలు సృష్టించగలిగే సదుపాయాన్ని కల్పించడం ఫలితంగానే ఉగ్రం లాటి కథ ఊపిరి పోసుకోగలిగింది. కథాగమనంలో ఎత్తుపల్లాలు, లోటుపాట్లు...వీటి గురించి మాట్లాడాల్సి వస్తే గనక దేని గురించైనా గంటల తరబడి మాట్లాడొచ్చు. వ్యాఖ్యానించవచ్చు. కానీ, ఇటువంటి కథను, ఒరిజినల్‌గా ఇండియాలో టోకున జరుగుతున్న మిస్పింగ్ కేసులనే యదార్ధ సంఘటనలను సినిమా కథగా ఎడాప్ట్ చేస్తున్నప్పుడు దర్శకరచయితలు సాధ్యమైనంత వరకూ పట్టు సాధించడానికే ప్రయత్నిస్తారు.
-
- వాళ్ళ పరిధి మేరకు చేయగలుగుతారు. అదే జరిగింది ఉగ్రం సినిమాలో. మొదటి సీను నుంచి కూడా నరేష్ తను ఓ పోలీసాఫీసర్ని, అంకుశంలో రాజశేఖర్‌ని అనుకునే వర్క్ చేయడంతో ఆ పాత్రని పండించగలిగాడన్నది వాస్తవం. కామెడీయే అన్నిటిలోనూ కష్టం అని చెప్పిన నరేష్, ఎమోషనల్‌గా చేయడం ఏమంత కష్టం కాదన్నట్టుగానే చేశాడు. ఫస్టాఫ్ చాలా స్పీడుగా, రేసీగా సాగినా, సెకండాఫ్‌లో ఎప్పుడైతే అసలు కథ మొదలైందో కొంత స్పీడు తగ్గినా సరే స్టడీగా వెళ్ళిందనే చెప్పాలి.
-
- కొన్ని సీన్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. అదీ నరేష్ పెరఫారమెన్స్ కారణంగానే చెప్పడానికి సందేహించనక్కర్లేదు. దర్శకుడు కనకమేడల రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేయడంలో కథలో టెంపో బాగానే మెంటైన్ అయింది. కిడ్నాప్ అయి, కుటుంబాలకు దూరమైపోయినవాళ్లు, అందులో హీరో ఫ్యామిలీ కూడా విక్టిమ్స్ అయిన ఫలితంగా హీరో క్యారెక్టరైజేషన్‌ని దర్శకుడు పండించడానికి వీలు కుదిరింది.
-
- ఇటువంటి సినిమాలకి రీరికార్డింగ్ చాలా ముఖ్యం. ఈ పనిని శ్రీ చరణ్ పాకాల చాలా ప్రొఫెషనల్‌గా హేండిల్ చేశాడు. సిద్ధార్ధ కెమెరాతో ఉగ్రం సినిమాకి కావాల్సిన కలర్ టెంపరేచర్ని కరెక్టుగా మేచ్ చేశాడు. రొటీన్ చిత్రాల మూస నుంచి ఇంకా బైటకు రాలేకపోతున్న కొంతమందికి ఉగ్రం నిర్మాతలు సాహో గారపాటి, హరీష్ పెద్ది ఇద్దరూ తిరుగులేని ఇన్సిపిరేషన్నే ఇచ్చారు. Written By నాగేంద్రకుమార్

Ehatv
Next Story