కామెడీ హీరోగా 50 సినిమాలకు పైగా చేసిన నరేష్.. నాంది సినిమాతో అల్లరి నరేష్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇక అదే ఫార్ములాను వాడేస్తున్నారు. నాందితో తనకు స్పెషల్ ఇమేజ్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకతంలోనే.. ఉగ్రం సినిమా చేశాడు అల్లరోడు. టీజర్, ట్రైలర్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఉగ్రం సినిమా.. తాజాగా థియేటర్లలో సందడి చస్తోంది. మరి ఈసినిమా ఎలా ఉంది..? ఎవరు ఎలా నటించారు చూద్దాం.

కామెడీసినిమాలు వర్కౌట్ అవ్వకపోవడంతో.. సీరియస్ పాత్రలు చేసుకుంటున్నాడు అల్లరి నరేష్. ఈరకంగా కూడా మంచి ఇమేజ్ సాధిస్తున్నాడు. నాందితో మొలయ్యి.. ఇట్లు మారేడు మిల్ల ప్రజానికం, ఇప్పుడు ఉగ్రం. ఇలా తన రూటు మార్చిన నరేష్.. ఈసినిమాతో హిట్ అందుకున్నాడా..?

కామెడీ హీరోగా 50 సినిమాలకు పైగా చేసిన నరేష్.. నాంది సినిమాతో అల్లరి నరేష్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇక అదే ఫార్ములాను వాడేస్తున్నారు. నాందితో తనకు స్పెషల్ ఇమేజ్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకతంలోనే.. ఉగ్రం సినిమా చేశాడు అల్లరోడు. టీజర్, ట్రైలర్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఉగ్రం సినిమా.. తాజాగా థియేటర్లలో సందడి చస్తోంది. మరి ఈసినిమా ఎలా ఉంది..? ఎవరు ఎలా నటించారు చూద్దాం.

కథ విషయానికి వస్తే.. సీఐ శివకుమార్ (అల్లరి నరేష్) ఒక సిన్సియర్ పోలీస ఆఫీసర్. అతను సిస్సియర్ కాబట్టి..ఎన్నో చిక్కులు ఎదుర్కొంటాడు. కేసుల పరంగా ఎన్నో చిక్కు ముడులు విప్పుతాడు. హీరోయిన్ మిర్న మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ పాపను కూడా కంటారు. కుటుంబంతో హాయిగా సాగిపోతున్న వీరి జీవితంలో.. ఒక యాస్కిడెంట్ విషాదం నింపుతుంది. కుటుంబాన్నిచెల్లా చుదురు చేస్తుంది. అంతే కాదు ఈ ప్రమాదంలో నరేష్ పాత్రకు మెమరీ లాస్ అవుతుంది. భార్య బిడ్డ కనిపించకుండా పోతారు. వీరికి ఒక పాప పుడుతుంది. వీరి జీవితం ఇలా హాయిగా సాగిపోతున్న తరుణంలో అల్లరి నరేష్ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో మనోడి మెమోరీ పోతుంది. అంతేకాదు, భార్య,బిడ్డ కూడా కనిపించకుండా పోతారు. ఇలా కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి..? అల్లరి నరేష్ మెమరీ ఎప్పుడు వస్తుంది. నరేష్ ఈకేసును చేదిస్తాడా లేదా అనేది సినిమాలో చూడాలి.

ఇక నటీనటులు వ విషయానికి వస్తే.. నాంది మాదిరిగానే ఈసినిమాలో కూడా అల్లరి నరేష్ వన్ మ్యాన్ షో చేశాడు . ఈసినిమా కథ అంతా అల్లరి నరేష్ చుట్టూనే తిరుగుతుంది. నరేష్ ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అవ్వడం మాత్రం ఖాయం. ముఖ్యంగా గతంలో అంత కామెడీ చేసి.. కడుపుబ్బా నవ్వించిన ఆ నరేష్.. ఈనరేష్ లోఇంత తేడా ఎలా..? అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయేలా నటించాడు. ఈపాత్రలో అంతగా తనను తాను ట్రాన్స్ ఫర్మ్ చేసుకున్నాడు. ఇక, అతని భార్య పాత్రను పోషించిన మిర్నా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే డాక్టర్ పాత్రలో ఇంద్రజ సైతం సినిమాకు తగ్గట్టు నటించింది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిది మేర నటించారు.

ఇక టెక్నిషియన్స్ గురించ మాట్లాడుకుందాం.... డైరెక్టర్ విజయ్ కనకమేడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్ ను గతంలో డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. కథ బాగా రాసుకున్నాడు..స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. అయితే స్టార్టింగ్ సినిమా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు... రాను రాను సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను తీశారు కాని.. దర్శకుడు కొన్ని చోట్ల తడబడిన ఫీలింగ్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ కథలు.. ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. ఆ పాయింట్ మీద అద్భుతంగా సినిమా చేశాడు విజయ్. ఇక సంగీతం పర్వాలేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవర్ ఆల్ గా ఉగ్రం సినిమా... నాంది సినిమా మాదిరి.. బ్లాక్ బస్టర్ కాకపోయినా. ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూడటానికి మాత్రం అద్భుతంగిా ఉంది అనాలి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాని తప్పకుండా నచ్చుతుంది. అల్లరి నరేష్ మరో ప్రయత్నం ఫలించింది అనే చెప్పాలి. ఇక ముందు ముందు కూడా నరేష్ సీరియస్ పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా మాత్రం ఏ జానర్ ఆడియన్స్ అయినా.. ఒక్క సారి చూడగలిగేలా ఉంది.

Updated On 5 May 2023 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story