మహర్షి(Maharshi), నాంది(Nandhi) చిత్రాలతో నటుడిగా తన చిరునామాను మార్చుకున్న అల్లరి నరేష్‌(Allari Naresh) ఇప్పుడు తాజాగా ఫుల్ యాక్షన్‌ కాప్‌గా, కొంత బ్లడ్‌షెడ్‌తో ఉగ్రం(Ugram) చిత్రం రూపంలో రేపు ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మహర్షి(Maharshi), నాంది(Nandhi) చిత్రాలతో నటుడిగా తన చిరునామాను మార్చుకున్న అల్లరి నరేష్‌(Allari Naresh) ఇప్పుడు తాజాగా ఫుల్ యాక్షన్‌ కాప్‌గా, కొంత బ్లడ్‌షెడ్‌తో ఉగ్రం(Ugram) చిత్రం రూపంలో రేపు ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లరి నరేష్‌గా దాదాపు 60 చిత్రాలతో ఇన్నాళ్ళ కెరీర్‌ని కొనసాగించి, ఇప్పుడు కొత్తగా యు టర్న్ తీసుకున్నాడు. మహర్షి, నాంది చిత్రాలలో అల్లరి నరేష్‌ యాక్టింగ్‌ టాలెంట్‌కి ఎనలేని గుర్తింపు వచ్చి, అల్లరి నరేస్‌ ఇలా కూడా చేయగలడా అనేంతగా అందరినీ ఆకట్టుకునేలా అల్లరి నరేష్‌ కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది.

ఇప్పడు ఉగ్రం చిత్రం రిలీజ్‌ అవుతోందంటే అందరి కళ్ళూ ఈ చిత్రం మీద, అల్లరి నరేస్‌ సాధించబోయే ఫలితంపైనే ఉన్నాయి. ఉగ్రం అనుకున్నట్టుగా ఆడితే నరేష్‌కి అడ్వాన్స్‌లు ఇవ్వడానికి రెడీగా చాలామంది కాచుక్కూచున్నారు. ఇన్నాళ్ళూ అల్లరి నరేష్‌గా పేరుపడ్డ మీరు ఉగ్రం చిత్రంతో ఉగ్రం నరేష్‌గా పేరుతెచ్చుకుంటారా అనడిగితే నాంది నరేస్‌ అనుకున్నా, ఉగ్రం నరేష్‌ అనుకున్నా కూడా ఏమీ పరవాలేదని, కాకపోతే ఈ చిత్రం మాత్రం నాకెరీర్‌లోనే ఓ మంచి మలుపుగా గుర్తంపు పొందుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు నరేష్‌. రేటాఫ్‌ సక్సెస్‌ ఏమాత్రం ఉండొచ్చు అనడిగితే నా కెరీర్‌లోనే ఉగ్రం హయ్యస్ట్‌ గ్రాసర్‌ అవుతుందని తిరుగులేని ధీమాని వ్యక్తం చేశాడు.

ఉగ్రం సినిమాలో అన్ని యాంగిల్స్‌ పెరఫెక్టుగా కలసివచ్చాయని, ముఖ్యంగా దేశంలో రోజుకు ఎంతమంది కిడ్నాప్‌ అవుతున్నారో, వాటి వెనుక ఉన్న మిస్టరీ ఏమిటో, దానిని ఎలా హీరో వెతికి పట్టుకున్నాడో.....అనే కీలకాంశాలపైనే ఉగ్రం చిత్రం ఆద్యంతం ఆధారపడి ఉంటుందని నరేష్‌, దర్శకుడు కనకమేడల ఇద్దరూ చెప్పారు.

రేపటి నుంచీ మనం కనబడం అని ఎవరైనా చెబితే మనం ఎటువంటి టెన్షన్‌ని ఎదుర్కొంటామో, అటువంటి టెన్షన్‌ ప్రతీక్షణం ధియేటర్‌లో ప్రేక్షకులు ఫీలవుతారని నరేష్‌ ప్రత్యేకంగా ఉగ్రం చిత్రం గురించి చెప్పాడు.
మొత్తానికి ఉగ్రం చిత్రంమీద బాగానే అంచనాలు ముసురుకుని ఉన్నాయి. మంచి టాకే ఉంది. ఇండస్ట్రీలో సర్కిల్స్‌లో ఉగ్రం చిత్రం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అందరూ ఆశించినట్టుగా, ఊహిస్తున్నట్టుగా గానీ ఉగ్రం చిత్రం హిట్‌ అయితే చాలా యాక్షన్‌ చిత్రాలకు నరేష్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అవుతాడని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.

Updated On 4 May 2023 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story