అల్లరి నరేష్(Allari Naresh)సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడిన ఆయన తాను పడినఅవమానాలను కూడా గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ నరేష్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. కామెడీ హీరోగా తనకంటూ ఓ సెపరేట్ రూటు ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్.. ఆతరువాత ఆ దారి వదలిపెట్టి సీరియస్ పాత్రల వైపు మళ్ళాడు. చాలా సీరియస్ గా సినిమాలు చేస్తున్నాడు.కామెడీ స్టార్ గా ఒకప్పుడు వేలుగు వేలుగిన ఆహీరో.. ఆరువాత వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు.

అల్లరి నరేష్(Allari Naresh)సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడిన ఆయన తాను పడినఅవమానాలను కూడా గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ నరేష్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు.

కామెడీ హీరోగా తనకంటూ ఓ సెపరేట్ రూటు ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్.. ఆ తరువాత ఆ దారి వదలిపెట్టి సీరియస్ పాత్రల వైపు మళ్ళాడు. చాలా సీరియస్ గా సినిమాలు చేస్తున్నాడు.కామెడీ స్టార్ గా ఒకప్పుడు వేలుగు వేలుగిన ఆహీరో.. ఆరువాత వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా.. తన కెరీర్ ను కొనసాగిస్తూ.. అందులోనే ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశాడు. . తాజాగా ఈ కామెడీ స్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినిమాల గురించి తనపై వస్తున్న విమర్షల గురించి కామెంట్లు చేశాడు నరేష్.

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్... కామెడీ హీరోగా వరుస సినిమాలు చేశాడు. తన వరకూ మంచి హిట్లు కొడుతూ వచ్చాడు. ఆ తరువాత ఫెయిడ్ అవుట్ అవుతున్నాడు అనుకున్న టైమ్ కు కాస్త రూటు మార్చుకుంటూ వస్తున్నాడు హీరో. అయితే తన మొదటి సినిమా అల్లరి తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం మూలంగా .. అల్లరి నరేష్ గా అతనికి పేరు ఫిక్స్ అయ్యింది. కామెడీ సినిమాలు వరసపెట్టి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున నరేష్... 2012లో సుడిగాడు తో హిట్ కొట్టాడు.

అప్పటినుంచి దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్కదానితోనూ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో నరేష్ కెరీర్ అయిపోయిందని విమర్శలు వచ్చాయి. నరేష్ ఇక సినిమాలు చేసి ఇక వేస్ట్ అనిచాలా మంది ముఖం మీదే అన్నవారు ఉన్నారు. అయినా వెరవకుండా. రూటు మార్చి.. నాంది సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఇక ఇప్పుడు అదే డైరెక్టర్ తో ఉగ్రం సినిమా చేసి.. మరో హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు . ఆమధ్య మహర్షిలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించాడు. ఇకు తాజాగా నాగార్జున సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఉగ్రం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు అల్లరి నరేష్. మే 5న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. నాంది సినిమాతో.. తన సినిమాల ఫార్ములాను మార్చేసిన అల్లరి నరేష్. సీరియస్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత నాంది సినిమాతో తనకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలోనే ఉగ్రం సినిమా చేశాడు అల్లరి నరేష్.

ఇక ఈసినిమా ప్రమోషన్ లో జోరుగా తిరుగుతున్నాడు అల్లరి నరేష్. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనకెరీర్ గురించి కూడా ప్రశ్నలు రాగా..సూటిగా స్పందించారు అల్లరి నరేష్. నేను నా కెరీర్ లో 60 సినిమాలు చేశాను, 60 శుక్రవారాలు చూశాను, హీరోగా నా కెరీర్ గురించి చాలామంది చాలా మాటలు అన్నారు. కాని నేను ఏ విషయాన్ని పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే.. నా లైఫ్ అక్కడికే ఎండ్ అయ్యి ఉండేది.

ఇదంతా కాదు. ఏది ఏమైనా... నేను నటనను వదిలే ప్రసక్తే లేదు. నేను చనిపోతేనే నా కెరీర్ అయిపోయినట్లు. అప్పటి వరకు నేను సినిమాలు చేస్తూనే ఉంటాను అన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాను అన్నారు. ఇక ఉగ్రం మూవీ ప్రమోషన్స్ తో బజిగా ఉన్న నరేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పాత్రలు పడితే చేయాలి అని చూస్తున్నాడు

Updated On 2 May 2023 6:58 AM GMT
Ehatv

Ehatv

Next Story