గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్(Kriti sanon) హీరోయిన్ గా నటించిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఓం రౌత్(Om Raut) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామా మూవీ.. రామాయణం ఆధారంగా రూపొందించబడినది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) లాంటి స్టార్స్ నటించారు. అయితే ఈసినిమా మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే ఉంది.
ఆదిపురుష్(Adipurush) పైవివాదాలు ఇప్పటికీ సర్థుమనిగేలా కనిపించడంలేదు. ఒకదాని తరువాత మరొకటి వివాదం ఈసినిమా టీమ్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజగా ఏమయ్యిందంటే..?
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్(Kriti sanon) హీరోయిన్ గా నటించిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఓం రౌత్(Om Raut) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామా మూవీ.. రామాయణం ఆధారంగా రూపొందించబడినది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) లాంటి స్టార్స్ నటించారు. అయితే ఈసినిమా మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూనే ఉంది. ఆదిపురుష్‌లో చూపించిన పాత్రలు ఒరిజినల్ రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని, సినిమాపై నిషేధం విధించాలని అలహాబాద్ హైకోర్టు లో పిటిషన్ దాఖలయ్యింది.
అంతే కాదు ఆదిపురుష్ లో ప్రతీ పాయింట్ వివాదమే అవుతోంది. రాముడికి మీసాలు ఉండటం ఏంటీ... రావణాసురుడు బొట్టు పెట్టుకోడా.. అసలు ఈ గందరగోళం పాత్రలేంటి అంటూ చాలా మంది హైదవులు మండిపడటం.. కేసులు వేయడం.. సినిమాను నిశేదించాలని కోర్టులకెక్కడం జరుగుతూనే ఉంది. ఇక ఈక్రమంలో తాజాగా అలహాబాద్ కోర్డ్(Allahabad Court) మూవీ టీమ్ పై మండిపడింది. ఆదిపురుష్ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని వస్తున్న ఆరోపణలపై, ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసిన డైలాగ్‌లపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సినిమా నిర్మాతలను ప్రశ్నించింది. ఈ కేసులో అసిస్టెంట్ రైటర్ మనోజ్ ముంతాషీర్ శుక్లాను(Manoj Munthasir Shukla) భాగస్వామిగా చేయాలని ఆదేశించిన కోర్టు.. ఈ మేరకు మనోజ్ ముంతాషీర్‌కు నోటీసులు కూడా జారీ చేసి...వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఇక ఈ విషయంలోసెన్సార్ బోర్డ్(Censor Board) ఏం చేస్తోందంటూ.. ప్రశ్నించింద కోర్ట్. సినిమాలో వివాదం అయ్యే వి ఉంటే వాటిని తొలగించడానికే కదా సెన్సార్ బోర్డ్ ఉంది. మరి ఆ బోర్ట్ ఎందుకు తన పని తాను చేయలేకపోయింది అంటూ ప్రశ్నించింది కోర్ట్. ఈ గందరగోళం నుంచిఆడియన్స్ ను బయటపడేసే బాధ్యత అందరి మీద ఉంది.. సినిమాలో కొన్ని సన్నివేశాలు (Adult)గా అనిపించాయి. ఇలాంటి సినిమాలను చూడటం చాలా కష్టం. ఇది చాలా తీవ్రంగా పరిగణించే విషయం. సెన్సార్ బోర్డు దీనిపై ఏమి చేసిందని కోర్టు ప్రశ్నించింది.ఒకవేళ సినిమా స్క్రీనింగ్ నిలిచిపోతే.. ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఉపశమనం లభిస్తుంది.. అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రేపు తదుపరి విచారణ కొనసాగనుంది.