ఓ గుట్కాకు సంబంధించిన అడ్వర్‌టైజ్‌మెంట్‌లో పాల్గొన్నారంటూ కోర్టులో(Court) దాఖలైన పిటిషన్‌తో బాలీవుడ్‌ అగ్రహీరోలైన షారుక్‌ఖాన్(shah Rukh Khan), అజయ్‌ దేవ్‌గణ్‌(Ajay devgan), అక్షయ్‌కుమార్‌కు(Akshay Kumar) కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ హీరోలు కొన్ని హానీకర ఉత్పత్తులకు సంబంధించి కమర్షియల్‌ యాడ్స్‌లో(Commercial advertisement) ప్రమోషన్‌ చేయడంపై అలహాబాద్‌ హైకోర్టులో(Allahabad High Court) మోతీలాల్‌ యాదవ్‌(Mothilal Yadav) అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు తీసుకున్నవారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరైంది కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పిటిషనర్‌ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే కోర్టుకు సమాచారం ఇచ్చారు. షారుక్‌ఖాన్, అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌కుమార్‌కు అక్టోబర్‌ 22న షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని కోర్టుకు చెప్పారు. అమితాబ్ బచ్చన్‌ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని కోర్టుకు పాండే వెల్లడించారు. అయినా కూడా ఓ గుట్కా కంపెనీ అమితాబ్ ప్రకటనలను ప్రసారం చెసిందని తెలిపారు. దీంతో అమితాబ్ ఆ కంపెనీకి నోటీసులు పంపారని చెప్పారు. ఈ ప్రకటనలపై ఓ కేసు సుప్రీంకోర్టు(Supreme Court) పరిధిలో ఇప్పటికే నడుస్తోందని పాండే కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. పాండే వాదనలు విన్న తర్వాత.. తదుపరి విచారణ వచ్చే ఏడాది మే 9కి వాయిదా వేసింది అలహాబాద్‌ కోర్టు.

Updated On 10 Dec 2023 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story