సమ్మోహనాకారుడు నందమూరి తారకరామారావు(Sr.NTR) జనం గుండెల్లో శ్రీరామచంద్రునిగా నిలిచిపోవడానికి కారణభూతమైన మహోన్నత పౌరాణిక చిత్రం, తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'(Lava Kusa) విడుదలై నేటికి 60 ఏళ్లు. సీతారాములుగా అంజలి, రామారావు జంటకి జనం తమ మనసుల్లో గుడి కట్టేశారు. వారు ఎక్కడికి కలిసి వెళ్లినా హారతులు పట్టారు.

Lava Kusa
సమ్మోహనాకారుడు నందమూరి తారకరామారావు(Sr.NTR) జనం గుండెల్లో శ్రీరామచంద్రునిగా నిలిచిపోవడానికి కారణభూతమైన మహోన్నత పౌరాణిక చిత్రం, తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'(Lava Kusa) విడుదలై నేటికి 60 ఏళ్లు. సీతారాములుగా అంజలి, రామారావు జంటకి జనం తమ మనసుల్లో గుడి కట్టేశారు. వారు ఎక్కడికి కలిసి వెళ్లినా హారతులు పట్టారు. తెలుగు చిత్రసీమలో అజరామర చిత్రం ‘లవకుశ’ నభూతో నభవిష్యత్ అనదగ్గ విజయం సాధించింది.అరవై ఏళ్ళవుతూ ఉన్నా, ఆ సినిమాను అధిగమించిన మరో పౌరాణికం మనకు కానరాదు.‘లవకుశ’లోని పాత్రల కోసమే ఆ యా నటీనటులు జన్మించారా అనిపిస్తుంది. సంగీతసాహిత్యాలు జోడుగుర్రాల్లా సాగాయి. సంగీత దర్శకునిగా శ్రీ ఘంటసాల సినీజీవితంలో లవకుశ ఒక కలికితురాయి. ఈ సినిమాలో ప్రతి పాట, పద్యం మహాద్భుతం .లవకుశ సినిమాకు 12 పాటలు 20కి పైగా పద్యాలతో ఘంటసాల గారు శతాబ్దాల పాటు నిలిచిపోయే పాటలు కంపోజ్ చేశారు. మరపురాని మరచిపోలేని పద్యాలు, పాటలతో తెలుగువారిని ‘లవకుశ’అలరించింది. 🙏🙏
