అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ ఫోటోలు(Deep Fake Photo), వీడియోలు ఎక్కువయ్యాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. డూప్లికేట్ వీడియోను కనిపెట్టడం కష్టమవుతోంది. ఇంతకు ముందు ఎంతో మంది హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. సైబర్ పోలీసులకు(Cyber Police) కంప్లయింట్ కూడా చేశారు. నటి అలియా భట్(Alia Bhatt) అయితే మళ్లీ డీప్ ఫేక్ బారిన పడింది.

Alia Bhatt Deep Fake Vedio
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ ఫోటోలు(Deep Fake Photo), వీడియోలు ఎక్కువయ్యాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. డూప్లికేట్ వీడియోను కనిపెట్టడం కష్టమవుతోంది. ఇంతకు ముందు ఎంతో మంది హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. సైబర్ పోలీసులకు(Cyber Police) కంప్లయింట్ కూడా చేశారు. నటి అలియా భట్(Alia Bhatt) అయితే మళ్లీ డీప్ ఫేక్ బారిన పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలియా భట్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందమైన డ్రెస్సులో ఉన్న అలియా భట్ చూపరులను కవ్విస్తోంది. ఇందులో పెద్దగా అశ్లీలత ఏమీ లేదు. కాకపోతే ఆ వీడియో అలియా భట్‌ది కాదు. నటి వామికా గాబికి(Wamika Gabi) చెందిన వీడియోలో ఏఐను ఉపయోగించి అలియా భట్ ఫేస్‌ను తగిలించారు. అందరూ ఇది అలియా భట్ వీడియోనేనని అనుకున్నారు. అది డూప్లికేట్ వీడియో అన్న సంగతి ఎవరికీ తెలియదు. అంత ఒరిజినల్‌గా ఉంది. కాకపోతే నెటిజన్లు మాత్రం ఇది డూప్లికెట్‌దని ఈజీగా గర్తుపట్టేశారు. అందుకు కారణమేమిటంటే రెండు రోజుల కిందటే వామికా గాబి ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోనే కొందరు పనికిమాలినవాళ్లు ఇలా డీప్ ఫేక్ చేశారు. దీని కంటే ముందు పడకపై ఎక్స్ పోజింగ్ చేస్తూ ఓ బ్రాండ్ గురించి కవ్విస్తూ చెబుతున్న ఆలియా భట్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇది కూడా డీప్ ఫేక్ వీడియోనే! వైరల్ అయిన కాసేపటికే వీడియో డిలీట్ అయ్యింది. డీప్ ఫేక్ బారిన పడిన వారిలో రష్మిక(Rashmika), కాజోల్(Kajol), ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కత్రినా కైఫ్ ఇలా చాలామందే దీని బారినపడ్డారు.
