బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం, ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్ (Alia Bhatt) ఇంట విషాదం చోటుచేసుకుంది. అలియాభట్ తాత నరేంద్రనాథ్ రాజ్‌దాన్ (Narendranath Razdan) 95 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం, ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్ (Alia Bhatt) ఇంట విషాదం చోటుచేసుకుంది. అలియాభట్ తాత నరేంద్రనాథ్ రాజ్‌దాన్ (Narendranath Razdan) 95 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలియా భట్ ఎంతో ప్రేమించే ఆమె తాత నరేంద్రనాథ్ రాజ్ దాన్ మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. రీసెంట్ గా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. అయితే నరేంద్రనాథ్‌ను కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి(Breach Candy Hospital) తరలించారు. అయితే హాస్పిటల్ కు తరలించినా..పెద్ద ఉపయోగం లేకుండా పోయింది.
ట్రీట్ మెంట్ తీసుకుంటుండగానే ఆ ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కావడంతో వైద్యులు ఆయనను ఐసీయూకు(ICU) తరలించి చికిత్సనందించారు. కాని అక్కడ కూడా ప్రయత్నాలు ఫలించలేదు. వయస్సు మీద పడటంతో.. ట్రీట్మెంట్ కు కూడా నరేంద్రనాథ్ శరీరం సహకరించలేదని తెలుస్తోంది.ఇక చికిత్స తీసుకుంటూనే.. ఈరోజు (జూన్ 1) నరేంద్రనాథ్ తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ మహేశ్ భట్ సతీమణి నటి సోని రాజ్‌దాన్ ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్(Instagram) ద్వారా షేర్ చేశారు. నరేంద్ర నాథ్ ఫోటో స్టిల్ ను పోస్ట్ చేసి.. ఈ విషాదకర వార్తను అందరితో పంచుకుంటూ.. సంతాప సందేశాన్ని అందించారు. ఇక ఆయన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా సంతాప సందేశాలు అందిస్తున్నారు.