ట్రిపులార్‌ సినిమా(RRR Movie)లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అలియా భట్‌(Alia Bhatt). ఇప్పుడామె చేతి నిండా ప్రాజెక్టులున్నాయి. బాలీవుడ్‌ బిజీ తారల్లో అలియా భట్‌ ఒకరు. ఆమె రెమ్యునరేషన్‌ కూడా బాగా ఎక్కువ. అయితే ఇప్పుడు వస్తున్న అవకాశాలు భవిష్యత్తులో వస్తాయన్న నమ్మకం లేదు. రెమ్యునరేషన్‌ కూడా తగ్గవచ్చు. అందుకే ఫ్యూచర్‌లో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అలియా భట్‌ కూడా బిజినెస్‌లో దిగుతున్నారు.

ట్రిపులార్‌ సినిమా(RRR Movie)లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అలియా భట్‌(Alia Bhatt). ఇప్పుడామె చేతి నిండా ప్రాజెక్టులున్నాయి. బాలీవుడ్‌ బిజీ తారల్లో అలియా భట్‌ ఒకరు. ఆమె రెమ్యునరేషన్‌ కూడా బాగా ఎక్కువ. అయితే ఇప్పుడు వస్తున్న అవకాశాలు భవిష్యత్తులో వస్తాయన్న నమ్మకం లేదు. రెమ్యునరేషన్‌ కూడా తగ్గవచ్చు. అందుకే ఫ్యూచర్‌లో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అలియా భట్‌ కూడా బిజినెస్‌లో దిగుతున్నారు. త్వరలోనే ఆమె నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇందుకోసం ఆమె ఏకంగా 37 కోట్ల రూపాయలతో ముంబాయి(Mumbai)లో ఓ ఇంటిని కొన్నారు. ఇందుకు సంబంధించి స్టాంప్‌ డ్యూటీనే 2.26 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇందులో తన ప్రొడక్షన్‌ హౌస్‌(Production House)ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అన్నట్టు ఇప్పటికే అలియాకు రెండు ఇళ్లు ఉన్నాయి. ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఓ ఇంటిని తన సోదరి షహీన్‌(Shaheen)కు గిఫ్ట్‌గా ఇచ్చారు. మరో ఇంట్లో భర్త రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor)తో కలిసి ఉంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఈ దంపతులకు అమ్మాయి పుట్టిన విషయం తెలిసిందే. డెలివరీ అయ్యాక కొన్ని రోజుల పాటు సినిమాలకు విశ్రాంతినిచ్చారు అలియా. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో అడుగు పెడుతున్నారు.

Updated On 25 April 2023 12:02 AM GMT
Ehatv

Ehatv

Next Story