టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. దిగ్గజ దర్శకుడు.. దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli)పై బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) ప్రశంసలు కురిపించారు. ఆయనతో పనిచేయడం అంటే.. స్కూల్‌కు వెళ్లడమే అన్నారు ఆలియా.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. దిగ్గజ దర్శకుడు.. దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli)పై బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) ప్రశంసలు కురిపించారు. ఆయనతో పనిచేయడం అంటే.. స్కూల్‌కు వెళ్లడమే అన్నారు ఆలియా.
బాహుబలి(bahubali), ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికాడు డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి.. హాలీవుడ్ స్థాయిలో తన ఇమేజ్ ను పెంచుకున్న దర్శక ధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli).టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్..రాజమౌళితో సినిమా కోసం ఎదరు చూస్తూ ఉన్నారు. జక్కన్నతో సినిమా అంటే హీరోలకు హీరోయిన్లకు ఓ డ్రీమ్ లా మారింది. అది బాలీవుడ్ లో కావచ్చు.. టాలీవుడ్ లో కావచ్చు.
ఇక తాజాగా ఆయన మరో గొప్ప ఘనత సాధించారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (Time magazine) రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023 (100 most influential people of 2023) జాబితాలోరాజమౌళి చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ హీరోయిన్ ఆియా భట్ స్పందించారు. రాజమౌళిపై ఆమె అభినందనల వెల్లువ కురిపించారు. ప్రశంసలతో ముంచెత్తారు. రాజమౌళితో పనిచేయడం అంటే.. మళ్ళీ స్కూల్ కు వెళ్లడమే. ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు అన్నారు.
జక్కన్నతో పనిచేసే అవకాశం అందరికి రాదు. కాని నాకు రావడం అదృష్టం అన్నారు ఆలియా. గతంలో బాహుబలి 2 ప్రివ్యూలో నేను ఎస్‌ఎస్ రాజమౌళిని మొదటిసారి కలిశాను. సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయాను. ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించాలి అని అనుకున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ కల నెరవేరింది అన్నారు ఆలియా. రాజమౌళి దగ్గర పని చేయడం అంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లడంతో సమానం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మరెన్నో కొత్త అంశాలు తెలుసుకోవచ్చు. నేను ఆయన్ని మాస్టర్ స్టోరీటెల్లర్ అని పిలుస్తా. ఆయన ఒక కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటుకు చేర్చుతారు అని అన్నారు బాలీవుడ్ బ్యూటీ.
ఇక యాక్టింగ్ పరంగా కూడా ఏదైనా సలహా ఇవ్వమని ఆయన్ని అడిగాను. దానికి రాజమౌళి ఒక్కటే మాట అన్నారు. ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రను ప్రేమతో చేయాలి అని రాజమౌళి అన్నారు.ఎంతలా అంటే.. సినిమా పెద్దగా ఆడకపోయినా.. సినిమా ప్లాప్ అయినా..మనం చేసిన పాత్ర నలుగురికి గుర్తుండిపోవాలి అన్నరు ఆలియా భట్.