సాధించాలి అనే తపన ఉంటే చాలు..వయస్సు అడ్డు కాదు అని నిరూపించింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య.. బాలీవుడ్ తార ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna). ఈ ఏజ్ లో కూడా తను అనుకున్న చదువు చదివి.. పట్టాను అందుకుంది. అది కూడా ఇండియాలో కాదు ఫారెన్ యూనివర్సీటీ నుంచి డిగ్రీ(Degree) పట్టా తీసుకుంది సీనియర్ తార. 1995 లో బర్సాత్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా..
సాధించాలి అనే తపన ఉంటే చాలు..వయస్సు అడ్డు కాదు అని నిరూపించింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య.. బాలీవుడ్ తార ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna). ఈ ఏజ్ లో కూడా తను అనుకున్న చదువు చదివి.. పట్టాను అందుకుంది. అది కూడా ఇండియాలో కాదు ఫారెన్ యూనివర్సీటీ నుంచి డిగ్రీ(Degree) పట్టా తీసుకుంది సీనియర్ తార. 1995 లో బర్సాత్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా.. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. సందడి చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. 2001 లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను(Akshay Kumar) పెళ్లాడాక సినిమాలకు దూరం అయ్యింది. సినిమాలకు దూరం అయినా.. రచయిత్రి గా.. కాలమిస్ట్ గా మాత్రం కొనసాగుతూ వచ్చింది ట్వింకిల్ ఖన్నా..
రీసెంట్ గా ట్వింకిల్ కన్నా మాస్టర్స్ డిగ్రీ(Master Degree) అందుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించింది బాలీవుడ్ సీనియర్ తార. ఆమె విజయం చూసి ఎమోషనల్ అయ్యారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. అంతే కాదు తన భార్య సాధించిన విజయాని సోషల్ మీడియా(Social media) వేధికగా పోస్ట్ పెడుతూ.. వెల్లడించారు.రెండేళ్ళ క్రితం నువ్వు మళ్ళీ చదువుకోవాలని ఉంది అని నాతో అన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. ఇల్లు, కెరీర్, నేను మరియు పిల్లలను చూసుకుంటూనే చదువును పూర్తి చేసావు. నేను ఒక సూపర్ ఉమెన్‌ని పెళ్లి చేసుకున్నాను..నాకు ఎంతో గర్వంగా ఉంది.. కంగ్రాట్స్ మై లవ్’ అనే శీర్షికతో అక్షయ్ భార్య కోసం పోస్టు పెట్టారు. అక్షయ్ పోస్టుపై ‘ఇంతలా ప్రోత్సహించే భర్త దొరకడం నా అదృష్టం’ అంటూ ట్వింకిల్ స్పందించారు.
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ డింపుల్-రాజేష్ ఖన్నాల కూతురైనా.. వారి ఇమేజ్ తో సబంధం లేకుండా.. సొంత టాలెంట్ పై ఆధారపడి స్టార్ డమ్ తెచ్చుకుంది బ్యూటీ. నటన విషయంలో కూడా తనదైన శైలి చూపించింది తార. ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ సమయమే అయినా.. మంచి సినిమాలు చేసింది ట్వింకిల్. ఇంటర్నేషనల్ ఖిలాడీ, జుల్మీ, యే హై ముంబయి మేరీ జాన్, చల్ మేరే భాయ్, జోడీ నెంబర్ 1 వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు ట్వింకిల్.
తెలుగులో విక్టరీ వెంకటేష్ జోడీగా శీను సినిమాలో నటించి మెప్పించింది బ్యూటీ. నటనతో పేరు తెచ్చుకున్నారు ట్వింకిల్. 2001 లో అక్షయ్ కుమార్‌ను పెళ్లాడిన ట్వింకిల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. గతంలో సినిమాల కోసం చదువుకి దూరమైన ట్వింకిల్ తన ఇష్టాన్ని కూడా నెరవేర్చుకున్నారు. 50 సంవత్సరాల వయసులో లండన్ గోల్డ్ స్మిత్స్ కాలేజీ నుండి మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు.