బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చాలా మంచివాడనే పేరే ఉంది. నీతిగా నిజాయితీగా ఉంటూ.. పద్దతిగా ఉంటాడన్న పేరు ఉంది. అంతే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీద.. అతి తక్కువ కాంట్రవర్సీలు ఉన్న హీరోగా అక్షయ్ కుమార్ కు రికార్డ్ కూడా ఉంది. ఈమధ్యనే ఆయన అసలైన భారతీయుడిగా మారాడు. మొన్నటి వరకూ కెనడా పౌరసత్వం ఉండగా.. దాన్ని వదిలేసుకుని..
తన మంచి మనసు కూడా చాటుకున్నా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar). నష్టాల్లో ఉన్న టీమ్ ను కాపాడటం కోసం కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ ను వదలుకున్నాడు అక్షయ్.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చాలా మంచివాడనే పేరే ఉంది. నీతిగా నిజాయితీగా ఉంటూ.. పద్దతిగా ఉంటాడన్న పేరు ఉంది. అంతే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీద.. అతి తక్కువ కాంట్రవర్సీలు ఉన్న హీరోగా అక్షయ్ కుమార్ కు రికార్డ్ కూడా ఉంది. ఈమధ్యనే ఆయన అసలైన భారతీయుడిగా మారాడు. మొన్నటి వరకూ కెనడా పౌరసత్వం ఉండగా.. దాన్ని వదిలేసుకుని.. భారతమాత ముద్దుబిడ్డగా మారిపోయాడు. అలాంటి అక్షయ్ కుమార్ తన మంచి మనసుతో కోట్ల రూపాయలను వదిలేసుకున్నాడుట. ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్షయ్ కుమార్ కు సబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. అతని గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథూర్(Amrit Mathur) తన ఆటో బయోగ్రఫీ పిచ్ సైడ్:మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనే పుస్తకంలో అక్షయ్ మంచి తనం గురించి ప్రస్తావించారు. కాంట్రాక్ట్ మధ్యలోనే వదిలేసి భారీ మొత్తాన్ని కూడా లెక్క చేయని అక్షయ్ ప్రవర్తన తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని మాథుర్ అందులో రాశారు.
అసలు ఏమైందంటే...ఐపీఎల్...కొన్నేళ్ళుగా క్రికెట్ ను ఏలుతోంది. ఇందులో ఆడటానికి ఇంట్రస్ట్ చూపించని ఆటగాడు ఉండడు. డబ్బులు కూడా చాలా భారీగానే వస్తాయి. ఇందులో ఫ్రాంచైజీలు ఉండడమూ...దానికి సినిమా స్టార్లు ఓనర్లుగా ఉండడం మొదటి నుంచి వస్తూనే ఉంది. ప్రీతిజింటా, షారూఖ్, జుహీ చావ్లా లాంటి వాళ్ళు ఫ్రాంఛైజీ ఓనర్లుగా ఉన్నారు. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఒక ఓనర్ గా ఉండేవాడుట. అయితే ఐపీఎల్ లో ఎంత లాభాలు వస్తాయో...అంతే బారీగా నష్టాలు కూడా వస్తాయి. 2009లో ఢిల్లీ డెవిల్స్ నష్టాల బాటలో ఉంది. అప్పుడు అక్షయ్ కుమార్ తాను ఆ ఫ్రాంచైజీతో చేసుకున్న 3 ఏళ్ళ ఒప్పందాన్ని వదిలేసుకోవాల్సి వచ్చిందట.
ప్రమోషన్ ఫిల్మ్స్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరు కావడం లాంటి వాటితో కూడాన కాంట్రాక్ట్ ను అక్షయ్ తో డీడీ చేసుకుంది. అయితే నష్టాలు రావడంతో కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావించింది. దాంతో అక్షయ్ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవాలని భావించిందిడీడీ. అయితే న్యాయపరంగా అదంత సులువైన విషయం కాదు. కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నా అక్షయ్ కు భారీ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ గా అదే టైమ్ లో అక్షయ్ తనకు రావాల్సిన మొత్తాన్ని వదులుకుని కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నారుట. ఈ న్యూస్ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా తెగ తిరిగేస్తోంది.