కొత్త అవతారం ఎత్తాడు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kummar). వంటి నిండా బూడిద.. జెడలు అల్లిన జుట్టు.. భీకర ఆకారంలో ఉన్న ఫోస్టర్ ఒకటి హల్ చేల్ చేస్తోంది.. ? ఇంతకీ అక్షయ్ ఈసారి ఏం చేయబోతున్నాడంటే..?

Akshay Kummar
కొత్త అవతారం ఎత్తాడు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kummar). వంటి నిండా బూడిద.. జెడలు అల్లిన జుట్టు.. భీకర ఆకారంలో ఉన్న ఫోస్టర్ ఒకటి హల్ చేల్ చేస్తోంది.. ? ఇంతకీ అక్షయ్ ఈసారి ఏం చేయబోతున్నాడంటే..?
బాలీవుడ్ లో(Bollywood) ప్రయోగాలు చేయాలి అంటే సీనియర్ హీరో అక్షయ్ కుమార్ తరువాతే ఎవరైనా. 100 కోట్ల హీరో.. వందరకాలుగా కనిపించమన్నా కనిపిస్తారు. సినిమా కోసం ఎంత కష్టపడాలన్నా. దానికి డబుల్ ఇంపాక్ట్ చూపిస్తారు అక్షయ్. ఇక ఈ సీనియర్ హీరో హీరోగా తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన సినిమా ఓ మై గాడ్(Oh My God). ఈమూవీ అప్పట్లో సంచలన విజయం సొంతం చేసుకుంది. ఉమేష్ శుక్ల(Umesh Shukla) దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లతో ఎన్నో ఘనతలు సాధించింది.
అంతే కాదు ఇదే సినిమా కిషోర్ కుమార్(Kishore Kummar) డైరెక్షన్ లో టాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యింది. వెంకటేశ్(Venkatesh), పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోలుగా... గోపాల గోపాల(Gopala Gopala) టైటిల్ తో తెరకెక్కిన ఈసినిమాను . తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఓ మై గాడ్-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా పంకజ్ త్రిపాఠి(Pankaj Tripati) కీలకపాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఈసారి దర్శకుడు మారాడు. అమిత్ రాయ్(Amith Roy) ఈసీక్వెల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. చివరి దశలో ఉంది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. చేతిలో ఢమరుకం పట్టుకుని జుట్టును విరబోసుకుని ఉన్న అక్షయ్ లుక్ ఆసక్తికకరంగా ఉంది. ఫస్ట్ లుక్ ను బట్టి ఈ సినిమాలో అక్షయ్ శివుడిగా కనిపించనున్నారు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
आ रहे हैं हम,
आइयेगा आप भी.
11th August. In theatres. #OMG2 pic.twitter.com/Fij3N8wco6— Akshay Kumar (@akshaykumar) June 9, 2023
