బాలీవుడ్‌లో ఒకప్పుడు హిట్‌ పెయిర్‌ ఏదంటే అక్షయ్‌కుమార్‌(Akshay Kumar)-రవీనా టాండన్‌లదే(Raveena Tandon)! వీరిద్దరు స్టార్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు హిట్లు, సూపర్‌హిట్లు అయ్యాయి. 1994లో విడుదలైన మోహ్రా(Mohra) సినిమాలో వీరిద్దరు మొదటిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్నో హిట్‌ చిత్రాలలో హీరో హీరోయిన్లుగా నటించారు. 2004లో వచ్చిన ఫోలీస్‌ ఫోర్స్‌(Police force) తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి నటించలేదు. ఇందుకు వీరి మధ్య వచ్చిన విభేదాలే కారణమంటారు చాలా మంది.

బాలీవుడ్‌లో ఒకప్పుడు హిట్‌ పెయిర్‌ ఏదంటే అక్షయ్‌కుమార్‌(Akshay Kumar)-రవీనా టాండన్‌లదే(Raveena Tandon)! వీరిద్దరు స్టార్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు హిట్లు, సూపర్‌హిట్లు అయ్యాయి. 1994లో విడుదలైన మోహ్రా(Mohra) సినిమాలో వీరిద్దరు మొదటిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్నో హిట్‌ చిత్రాలలో హీరో హీరోయిన్లుగా నటించారు. 2004లో వచ్చిన ఫోలీస్‌ ఫోర్స్‌(Police force) తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి నటించలేదు. ఇందుకు వీరి మధ్య వచ్చిన విభేదాలే కారణమంటారు చాలా మంది. వృత్తిపరమైన కారణాల వల్లే కలిసి నటించలేదంటారు కొందరు. ఏదైతేనేం దాదాపు రెండు దశాబ్దాల నుంచి వీరు స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు.
కాగా, లేటెస్ట్‌ సమాచారం ప్రకారం అక్షయ్‌ కుమార్‌ - రవీనా టాండన్‌ త్వరలోనే ఓ సినిమాలో కలిసి నటించనున్నారని తెలిసింది. వెల్‌కమ్‌ 3(Wellcome-3) పేరుతో రూపొందుతున్న ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వీరిద్దరూ కలిసి నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే దాదాపు 20 ఏళ్ల తర్వాత కలిసి నటించినట్లు అవుతుంది. ఇక, మోహ్రా సినిమాతో అక్షయ్‌ - రవీనా మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. ఆ ఫ్రెండ్‌షిప్‌ కాస్త ప్రేమగా మారింది. తర్వాత రిలేషన్‌లోకి ఎంటరయ్యారు. కొంతకాలానికి వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. రాజేశ్‌ ఖన్నా, డింపుల్‌ కూతురు ట్వింకిల్‌ ఖన్నాను(Twinkle Khana) అక్షయ్‌ కుమార్‌ 2001లో వివాహం చేసుకున్నారు. మరోవైపు రవీనా సైతం అనిల్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.

Updated On 24 Aug 2023 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story